మాస్ క్లాస్ కలిపి కుమ్మేసింది.. ‘చిన్నారి పెళ్లి కూతురు’ రచ్చ రచ్చ
అవికా గోర్ బుల్లితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆనంది పాత్రలో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఆనందిగా తెలుగు ప్రేక్షకులపై అవికా గోర్ చెరగని ముద్ర వేసింది. అయితే బుల్లితెరపై సక్సెస్ అయినట్టుగా వెండితెరపైనా హీరోయిన్‌గా మంచి విజయాలను అందుకుంది. కానీ ఎక్కువగా ఆఫర్లను చేజిక్కించుకోలేకపోయింది.

బుల్లితెరపై అలా..
బుల్లితెరపై ఆనందిగా అవికా గోర్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. బుల్లితెరపై ఫేమస్ అయి వెండితెర మీద కూడా రాణించడం సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలా అవికా గోర్ మాత్రం సిల్వర్ స్క్రీన్ మీద కూడా సక్సెస్ అయింది. వరుసగా హిట్లు కొట్టేసింది.

సినిమాల్లో సక్సెస్..
ఉయ్యాలా జంపాల సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో సక్సెస్ అయింది. ఆ తరువాత మళ్లీ సినిమా చూపిస్త మావ అనే సినిమాతో మరో హిట్ కొట్టేసింది. ఎక్కడికి పోతావే చిన్ని నాయనా అనే చిత్రం కూడా సూపర్ హిట్ అయింది.

మళ్లీ బుల్లితెరపై..
అయితే మళ్లీ ఇన్నాళ్లకు అవికా గోర్ బుల్లితెరపై ప్రత్యక్షమైంది. స్టార్ మాలో రియల్ జంటలు రీల్ జంటలు అంటూ పెట్టిన 100 పర్సెంట్ లవ్ షోలో దుమ్ములేచిపోయేలా ఎంట్రీ ఇచ్చింది. మొన్నటి ఆదివారం నాడు మొదటి పార్ట్ ప్రసారం కాగా బాగానే క్లిక్ అయింది. ఇక వచ్చే ఆదివారం రానున్న ఎపిసోడ్‌లో అవికా గోర్ ప్రత్యక్షం కానుంది.

మాస్ క్లాస్ కలిపి..
అవికా గోర్ ఇప్పుడు ఈ షోలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మాస్ క్లాస్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. అవికా గోర్ మీద వదిలిన ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమోలోనే ఇలా ఇరగ్గొట్టేసిందంటే షోలో దుమ్ములేపి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

ప్రేమికుడిని..
అవికా గోర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రేమికుడి గురించి అవికా బహిరంగంగానే ప్రకటించేసింది. అయితే మరి ఈ రియల్ కపుల్ షోలో అతన్ని తీసుకొస్తుందా? లేదా? అన్నది ఇంకొన్ని రోజుల్లో తెలిసిపోతోంది.


Click it and Unblock the Notifications











