Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దివికి అది ఎక్కువ.. కన్నేసిన అవినాష్.. మామూలోడు కాదుగా!
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పేరు కూడా తెలియని నటీనటులు బిగ్ బాస్ షో వల్ల ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు నాలుగో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ షో పూర్తై రెండు నెలలు అవుతున్నా కూడా ప్రతీ రోజూ తమ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు.
అలా హల్చల్..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు నిత్యం తెరపైన కనిపిస్తూనే ఉన్నారు. అలా ప్రతీ సారి ఏదో ఒక షోలో, ప్రతీ పండుగకు వచ్చే ఈవెంట్లలో కనిపిస్తూ హల్చల్ చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్లతోనే స్పెషల్ ఈవెంట్లను, షోలను ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఇమేజ్‌తోనే షోలను నడిపిస్తున్నారు.
ఆ రెండు అలానే..
బిగ్ బాస్ కంటెస్టెంట్లను ముందు పెట్టి కామెడీ స్టార్స్, స్టార్ట్ మ్యూజిక్ షో అనే రెండు షోలను ప్రారంభించేశారు. స్టార్ట్ మ్యూజిక్ షోలో స్టార్ మాలోని సీరియల్ నటీనటులు, బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొస్తున్నారు. అయితే అన్నీ షోల్లో అరియానా, అవినాష్‌లు మాత్రం కంపల్సరీ అన్నట్టు తయారైంది.
స్పెషల్ ప్రోగ్రాం..
ఇక రియల్ కపుల్స్, రీల్ కపుల్స్, బిగ్ బాస్ ఉత్సవం ఇలా స్పెషల్ ప్రోగ్రాంలోనూ అవినాష్, అరియానాలు బాగానే హల్చల్ చేశారు. అయితే దివి మాత్రం అంతగా ఫోకస్ అవ్వడం లేదు. అయితే దివి మాత్రం సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. బుల్లితెరపై మాత్రం దివి ఎక్కువగా హడావిడి చేయదు.
ఆ షోలో అలా..
తాజాగా దివి స్టార్ట్ మ్యూజిక్ షోలో కనిపించింది. దివి అరియానా అవినాష్ సుజాత వంటి వారంతా పాల్గొన్నారు. ఇందులో దివి అరియానా సుజాతలను సుమ ఓ ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది. అమ్మ రాజశేఖర్ సైతం ఈ షోలో ఓ రేంజ్లో హల్చల్ చేసినట్టున్నాడు.
అది ఎక్కువ..
తాజాగా వదిలిన ప్రోమోలో అరియానాకు తొందర ఎక్కువ అని సుమ కామెంట్ చేస్తే.. దివి అందం ఎక్కువ అని అవినాష్ తన పులిహోరను మళ్లీ కలపడం ప్రారంభించేశాడు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ అవినాష్ దివితో బాగానే కెమిస్ట్రీ కలిపాడు. దివి అందాని సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆమెకు మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్లో చాన్స్‌లు వచ్చాయి.