శ్రీముఖి పరువు తీసిన ఫ్రెండ్: పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. నేనే సెటప్ చేశా అంటూ షాకింగ్‌గా!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా ఉన్నా.. అందులో ఒకరిద్దరు మాత్రమే ఓ రేంజ్‌లో హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖిదే. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా వరుసగా షోలు మీద షోలు చేస్తూ దూసుకుపోతోంది.
దీంతో ఏ ఛానెల్‌లో చూసినా.. ఏ కొత్త షోలో చూసినా ఈ అమ్మడే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో శ్రీముఖి పరువు తీసేశాడు ఆమె స్నేహితుడు, ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

ఎన్నో షోలు చేస్తూ రచ్చ: యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. ఈ మధ్య ఈ భామ 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'బీబీ జోడీ' వంటి షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. ఇక, ఇప్పుడు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతూ దూసుకుపోతోంది.

వాళ్లతో పరివారంగా వచ్చి: ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మా ఛానెల్‌లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి సండే ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో బుల్లితెర ప్రముఖులు గెస్టులుగా వచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో శ్రీముఖితో పాటు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్, ఫైమా, ఎక్స్‌ప్రెస్ హరి కూడా సందడి చేస్తోన్నాడు. వీళ్లంతా ప్రేక్షకులకు మజా పంచుతోన్నారు.

ఈ వారం పిల్లలతో కలిసి: ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలోకి బుల్లితెరపై సందడి చేస్తోన్న సెలెబ్రిటీలు వచ్చి రెండు టీమ్‌లుగా ఏర్పడి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు జూనియర్ సింగర్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లంతా ఆటపాటలతో ఓ రేంజ్‌లో సందడి చేశారు. వాళ్లతో కలిసి శ్రీముఖి తెగ అల్లరి చేసింది.

పెళ్లై పిల్లలు పుట్టారంటూ: 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా శ్రీముఖి పిల్లలను పరిచయం చేసిన తర్వాత ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడమే అవినాష్ శ్రీముఖితో 'ఓహో నీకు పెళ్లై ఇంత మంది పిల్లలు పుట్టేశారు' అని ఆమె పరువు తీశాడు. దీనికి ఈ బ్యూటీ 'వీళ్లంతా నా పిల్లలు కాదు.. స్టార్ మా పిల్లలు' అంటూ సమాధానం చెప్పి నోరు మూయించింది.
నువ్వు ఏమీ వేయట్లేదుగా: 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో పిల్లలందరూ కలిసి అక్కడున్న వాళ్లను ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా అవినాష్‌ను పలుమార్లు కొట్టారు. అలాగే, ఎక్స్‌ప్రెస్ హరిపై పంచులు పేల్చారు. దీంతో హరి 'అమ్మగారు చూడండి పిల్లలు కూడా పంచ్‌లు వేస్తున్నారు' అన్నాడు. దీనికి శ్రీముఖి 'వాళ్లు అవైనా వేస్తున్నారు.. నువ్వు అవి కూడా వేయట్లే కదా' అని షాకిచ్చింది.

నేను సెటప్ చేశానంటూ: 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో పిల్లలు తమను ఓ ఆట ఆడుకుంటూ ఉండగా అవినాష్ 'పిల్లలను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఒక సెటప్‌ను అరేంజ్ చేశా' అని అన్నాడు. దీంతో హరి వెంటనే షాకై అతడి ముఖం చూశాడు. అప్పుడు అవినాష్ 'నేను అన్నది నువ్వు అనుకునే సెటప్ కాదు. వేరేది' అంటూ డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు.


Click it and Unblock the Notifications











