భార్యతో కాకుండా లవర్‌తో రొమాన్స్.. బిగ్‌బాస్‌లో జబర్దస్త్ అవినాష్ రచ్చ!
బిగ్‌బాస్ తెలుగు 8లో ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వారు హరితేజ, మెహబూబ్, రోహిణి, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, ముక్కు అవినాష్, నయని పావని , టేస్టీ తేజ. వీరు హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి గేమ్‌లో వేగం పెరగడంతో పాటు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ముక్కు అవినాష్, రోహిణిలు తమ పర్ఫార్మెన్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్నారు. గతవారం బీబీ హౌస్‌లో వీరిద్దరు చేసిన ఫన్నీ టాస్క్ బిగ్‌బాస్‌నే మెప్పించింది. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ షో ద్వారానే అవినాష్, రోహిణిలు బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్‌లో ఛాన్స్ అందుకున్న వీరిద్దరూ ప్రజలకు మరింత చేరువయ్యారు. వీరికి సినిమాలు, పలు షోలో మంచి ఆఫర్లు దొరుకుతున్నాయి. ఎప్పుడు బిగ్‌బాస్ షో ప్రారంభమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్‌లో అవినాష్, రోహిణిల పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. గతంలో బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు అంతగా హౌస్‌ని కళకళలాడేలా చేశారు వీరిద్దరూ . వీరు ఎలిమినేట్ అయినప్పుడు ఇంటి సభ్యులంతా అంతే ఎమోషనల్ అయ్యారు.

అనూజను పెళ్లాడిన ముక్కు అవినాష్ అనంతరం భార్యతో కలిసి ఎన్నో వీడియోలను తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసి బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. పెళ్లయిన కొద్దినెలలకే భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఈ దంపతులు, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు. కానీ పురిట్లోనే బిడ్డను కోల్పోయేసరికి ఈ దంపతులు ఎంతో బాధపడ్డారు. ఇప్పటికీ ఈ సంగతి గుర్తొచ్చినప్పుడల్లా అవినాష్ పలు వేదికలపై కన్నీటి పర్యంతమయ్యాడు. అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అవినాష్ అంతలా ఎమోషనల్ అయ్యే సరికి చాలా మంది తట్టుకోలేకపోయారు.
ఇక బిగ్‌బాస్ తెలుగు 8లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. తన పంచ్‌లు, ప్రాసలు, టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆరో వారంలో రోహిణి, అవినాష్‌లు భార్యాభర్తల్లా ఓ స్కిట్ చేసి ఇరగదీశారు. నువ్వు నా మొగుడివి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానని అంటుంది. దీనికి బిగ్‌బాస్ హౌస్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌ను ఇమిటేట్ చేస్తూ అవినాష్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయి. ఇంతలో స్టేజ్ మీదకి హరితేజను పిలుస్తాడు అవినాష్.
ఆయన అందరికీ బిగ్‌బాస్ అని నాకు మాత్రం గోపీ అంటుంది హరితేజ. ఆమెను ఒకసారి కన్ఫెషన్ రూమ్‌కి రావాలని అవినాష్ చెప్పడంతో రోహిణి వచ్చి నెత్తి నోరు బాదుకుంటుంది. మీ ఇద్దరికి బిగ్‌బాస్ షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాడని, హౌస్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుందని అవినాష్ చెబుతాడు. ఆ మాటతో హరితేజ, రోహిణిలు వైల్డ్ కార్డ్ ఎవరని అతనిని నిలదీస్తారు. ఆ వెంటనే మీ ఇద్దరు ఎలిమినేట్ అయినట్లుగా అవినాష్ అంటాడు. ఇది సరదా కోసమే చేశామని , ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని వీరు ముగ్గురు అడుగుతారు.
వీరి ఆటకు సంతోషించిన బిగ్‌బాస్.. గిఫ్ట్ పంపించానని స్టోర్‌లో ఉన్న దానిని తీసుకురావాలని టేస్టీ తేజాను ఆదేశిస్తాడు. అక్కడ ఉప్పు ప్యాకెట్ చూసి తేజ షాక్ అవుతాడు.. అనంతరం దానిని బొజ్జలో దాచుకుని వస్తాడు. బిగ్‌బాస్ ఏం ఇచ్చాడ్రా అని అడగ్గా ఉప్పు ప్యాకేట్ తీసి చూపించడంతో ఇంటి సభ్యులంతా షాక్ అవుతారు. ఇది మాకు రూ.50 వేలతో సమానమని అంటుంది రోహిణి. దీనికి కారణం లేకపోలేదు. రేషన్ కోసం నబీల్, నిఖిల్ లోపలికి వెళ్లి సరుకులు తీసుకునే తొందరలో ఉప్పు ప్యాకెట్ మరిచిపోతారు. ఈ విషయం తెలిసి అందరూ కలిసి బిగ్‌బాస్‌ను ప్రాధేయపడతారు. సాల్ట్ ప్యాకేట్ ఇవ్వాలంటే ప్రైజ్ మనీలో నుంచి రూ.50 వేలు కట్ అవుతాయని బిగ్‌బాస్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇప్పుడు అవినాష్ స్కిట్ వల్ల సాల్ట్ దొరికేసరికి అంతా సంతోషిస్తారు.


Click it and Unblock the Notifications











