Just In
- 37 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- News
కన్న కూతుళ్లనే చెరబట్టిన తండ్రి... ఏళ్ల తరబడి అత్యాచారం... హైదరాబాద్‌లో వెలుగుచూసిన దారుణం..
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ కంటెస్టెంట్లతో అభిజీత్ మాస్టర్ ప్లాన్: నోరు జారడంతో నాగార్జున ముందే లీకైపోయింది!
కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ దక్కని గుర్తింపును.. బిగ్ బాస్ షో ద్వారా అందుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అభిజీత్. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మిగిలిన కంటెస్టెంట్లు విమర్శిస్తున్నా గొడవలకు దిగకుండా ఉంటూ ప్రేక్షకుల ఆదరణను అందుకున్నాడు. ఫలితంగా ఫినాలేలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో మిగిలిన కంటెస్టెంట్లతో అభిజీత్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తాజా ఎపిసోడ్‌తో ఓ న్యూస్ లీకైంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

లవ్ ట్రాకులతో హాట్ టాపిక్‌గా అభిజీత్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అభిజీత్. షో ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడతను. దీనికి కారణం మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. ఆ తర్వాత దేత్తడి హారికతో క్లోజ్ అయ్యాడు. ఈ రెండు ట్రాక్‌లు బాగా హైలైట్ అవడంతో అభిజీత్ కూడా హాట్ టాపిక్ అయ్యాడు.

మైండ్ గేమ్ స్పెషలిస్టు.. బ్యాడ్ నేమ్‌తో
బిగ్ బాస్ హౌస్‌లో జరిగే టాస్కులను కండ బలం ఉన్నవారే గెలుచుకుంటారన్న అభిప్రాయాలను తన బుద్ధి బలంతో చెరిపేశాడు అభిజీత్. శారీరకంగా శ్రమ పడకుండా కొన్ని టాస్కుల్లో తన బుర్రకు పని చెప్పి విజేతగా నిలిచాడు. దీంతో మైండ్ గేమర్ అని అతడికి పేరొచ్చింది. అదే సమయంలో ఫిజికల్ టాస్కులు సరిగా ఆడలేడని అభికీ బ్యాడ్ నేమ్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

అది అతడికి బాగా ఉపయోగపడిందిగా
సీజన్ ఆరంభంలో జరిగిన రోబోట్ టాస్క్ సమయంలో సయ్యద్ సోహెల్ రియాన్, మెహబూబ్, అఖిల్ సార్థక్‌లు టార్గెట్ చేయడంతో పాటు తిట్ల దండకం అందుకోవడంతో అభిజీత్‌కు సింపతీ పెరిగింది. అలాగే, తరచూ అతడిని హౌస్‌మేట్స్ అందరూ నామినేట్ చేయడం కూడా బాగా ఉపయోగపడింది. ఈ క్రమంలోనే అభిజీత్ ఓటింగ్ గ్రాఫ్ ప్రతి వారం క్రమంగా పెరుగుతూ వచ్చింది.

బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభీనే
బిగ్ బాస్ షోలో విన్నర్ ఎవరు అవుతారు అనేది ఫినాలే ఎపిసోడ్ వరకూ తెలియదు. కానీ, నాలుగో సీజన్‌లో మాత్రం పరిస్థితి దానికి భిన్నంగా తయారైంది. ప్రారంభంలో టైటిల్ ఫేవరెట్లుగా భావించిన కొందరు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ సారి అభిజీత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తం అవుతోంది.

ఆ కంటెస్టెంట్లతో అభిజీత్ మాస్టర్ ప్లాన్
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో అభిజీత్ క్లాస్‌గా ఉంటాడు. అది అతడి ప్రవర్తన చూసిన వారికి అర్థం అవుతుంది. కానీ, ఇప్పుడిప్పుడే అతడిలోని మాస్ కూడా బయటకు వస్తోంది. ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ముందే ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నాలుగో సీజన్‌లోని కంటెస్టెంట్లు అందరితో అభిజీత్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు ఓ న్యూస్ లీకైంది.

నోరు జారడంతో నాగార్జున ముందే లీక్
ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున కార్ఖానా టాపిక్ గురించి మాట్లాడుతున్న సమయంలో.. సోహెల్ ‘కార్ఖానా కాదు సార్.. ఫాంహౌజ్‌లో పార్టీ చేసుకోబోతున్నాం. అభిజీత్ దాన్ని ప్లాన్ చేస్తున్నాడు' అని నోరు జారాడు. అదే విషయాన్ని అవినాష్ సైతం మరోసారి చెప్పాడు. దీంతో బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత అభిజీత్ పెద్ద పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు అందరికీ అర్థం అయిపోయింది.