Just In
- 2 min ago
ఉదయం పెళ్లి, రాత్రి మంది పార్టీ చేసుకొని ప్రమాదానికి గురైన హీరో.. గుట్టుచప్పుడు కాకుండా
- 30 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 2 hrs ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
Don't Miss!
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- News
నీ వెనుక మేం ఉన్నాం: ఆ విషయంలో జాగ్రత్త: అఖిల ప్రియకు చంద్రబాబు ఫోన్: ఫస్ట్‌టైమ్
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆమెను అక్కడ ప్రెస్ చేసిన అవినాష్: వీడియో చూపించాలని నాగార్జునకు రిక్వెస్ట్
జబర్ధస్త్ అనే షో ద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు ఫేమస్ కమెడియన్ ముక్కు అవినాష్. దీని ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. షోలోకి వెళ్లిన కొత్త ఎంతో సరదాగా కనిపించిన అతడు.. నవ్వుతూ నవ్విస్తూ వచ్చాడు. కానీ, సీజన్ చివరి దశకు చేరుకోగానే అతడిలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా అవినాష్.. ఓ అమ్మాయి విషయంలో వివాదాస్పదమయ్యాడు. దీంతో ఈ పంచాయితీ నాగార్జున వరకూ వెళ్లింది. ఆ వివరాలు మీకోసం!

మోనాల్ పాలను దొంగిలించిన అవినాష్
ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో తన పాలు తక్కువగా ఉండడంతో మోనాల్ క్యాన్ నుంచి దొంగిలించాడు అవినాష్. దీన్ని గమనించిన ఆమె తన పాల కోసం అతడితో వాగ్వాదానికి దిగింది.

అవినాష్‌ను తన కాలితో తన్నిన మోనాల్
ఈ టాస్క్ జరుగుతోన్న సమయంలో అవినాష్... మిగిలిన కంటెస్టెంట్లపై అసహనం వ్యక్తం చేశాడు. మరీ ముఖ్యంగా అఖిల్, సోహెల్ ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా నెట్టేస్తున్నారని ఆరోపించాడు. సరిగ్గా అలాంటి సయమంలోనే మోనాల్ గజ్జర్.. అవినాష్‌ను కాలితో తన్నింది. దీంతో అతడు బాగా ఫీల్ అయిపోయి గొడవకు దిగాడు. అప్పుడు అఖిల్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో అది ఇంకా ఎక్కువైంది.

గేమ్ ఆడనంటూ వెళ్లి... మోసం చేశాడు
తనను మోనాల్ కాలితో తన్నడం... మిగిలిన కంటెస్టెంట్లు తనను పాలు పట్టుకోడానికి వీలు లేకుండా చేయడం వంటి కారణాలతో అవినాష్ టాస్క్‌ను మధ్యలోనే ఆపేశాడు. అంతేకాదు, ఇకపై టాస్క్ ఆడనని, కావాలంటే తనను ఎలిమినేట్ చేసుకోమని బిగ్ బాస్‌కు చెప్పాడు. ఇదిలా ఉండగా, ఇంట్లో ఉన్న పాలను, నీళ్లను తన క్యాన్‌లో పోసి అందరినీ మోసం చేసే ప్రయత్నం చేశాడు.

అవినాష్‌కు షాకిచ్చిన బాస్.. విమర్శలు
బజర్ మోగే సమయానికి ఎవరి దగ్గర తక్కువ పాట బాటిళ్లు ఉంటాయో.. వాళ్లు టాస్క్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందని బిగ్ బాస్ ముందుగానే చెప్పాడు. మొదటి బజర్ సమయంలో అవినాష్ దగ్గర ఎక్కవ పాట బాటిళ్లే ఉన్నాయి. కానీ, అతడు నీళ్లు కలిపి మోసం చేశాడని కంటెస్టెంట్లు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అవినాష్‌ను టాస్క్ నుంచి తప్పించాడు బిగ్ బాస్.

ఆమెను ప్రెస్ చేసినందుకే కొట్టానని చెప్పి
మోనాల్ తనను కొట్టినందుకు అవినాష్ బాగా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, ఆమెకు అఖిల్ వత్తాసు పలకడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే మోనాల్.. అవినాష్ దగ్గరకు వచ్చింది. ఈ విషయం గురించి క్లియర్ చేసుకుందామని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆరియానాను ఆవు కింద ఉన్నప్పుడు ప్రెస్ చేసినందుకే కొట్టానని క్లారిటీ ఇచ్చింది.

వీడియో చూపించాలని నాగార్జునకు రిక్వెస్ట్
ఆరియానాను నెట్టేశానని మోనాల్ అనడంతో అవినాష్ తట్టుకోలేకపోయాడు. అంతేకాదు, ఒక అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడని బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం ఉండడంతో అతడు బాగా బాధ పడ్డాడు. దీంతో వీకెండ్ ఎపిసోడ్‌లో ఆ గొడవకు సంబంధించిన వీడియోను చూపించి న్యాయం చేయాలని హోస్ట్ నాగార్జునకు రిక్వెస్ట్ చేశాడు. మరి ఈ గొడవపై ఆయన ఏం చేస్తాడో చూడాలి.