Bigg Boss Telugu 8 Final : బిగ్‌బాస్ నుంచి అవినాష్ ఔట్ .. సెల్యూట్ కొట్టిన నాగార్జున

15వ వారం నాటికి నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్‌లు మాత్రమే కంటెస్టెంట్స్‌గా మిగిలి టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అవినాష్ టికెట్ టూ ఫినాలే గేమ్స్‌లో అందరికంటే ముందే ఫైనల్‌లో అడుగుపెట్టేశాడు. అయితే ప్రధానంగా నిఖిల్, గౌతమ్‌ల మధ్యే హోరాహోరీ పోరు జరుగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సీజన్‌కు చీఫ్ గెస్ట్‌గా రానున్నారు. ఇక ఫైనల్ ప్రారంభం కాగానే ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున వేదిక మీదకు పిలిచారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు చోటు చేసుకున్న గొడవలు, వాగ్వాదాలు, సరదా సంఘటనలను చూసి కంటెస్టెంట్స్ అంతా ఎమోషనల్ అయ్యారు.

అయితే సీజన్ 8లో విజేత గెలుచుకోబోయే ప్రైజ్ మనీని తొలుత నాగార్జున రూ. 54,99,999 అని ప్రకటించారు. అయితే ఓ చిన్న టాస్క్ ద్వారా ఒక రూపాయి పెంచి రౌండ్ ఫిగర్‌గా రూ.55,00,000గా మార్చారు నాగ్. అనంతరం కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర బిగ్‌బాస్ స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. తన కొత్త సినిమా యూఐ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ రీష్మా నన్నయతో కలిసి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ను బిగ్‌బాస్ స్టేజ్‌పై విడుదల చేశారు.
అనంతరం ఉపేంద్రకు నాగార్జున ఓ చిన్న టాస్క్ ఇచ్చారు. హౌస్‌లోకి వెళ్లి టాప్ 5లో ఉన్న ఒకరిని బయటికి తీసుకురమ్మని చెబుతాడు. హౌస్‌లో ఉపేంద్రను చూడగానే కంటెస్టెంట్స్ అంతా ఆయన కాళ్లపై పడతారు. అనంతరం అందరినీ యాక్షన్ రూమ్‌లోకి తీసుకెళ్లి కమెండోలుగా కొందరినీ పంపుతారు.. వారంతా లేజర్ లైట్స్‌తో అవినాష్‌ను టార్గెట్ చేస్తారు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించగా.. అతనిని తీసుకుని స్టేజ్ మీదకు వచ్చారు ఉపేంద్ర.
అలా బిగ్‌బాస్ తెలుగు 8లో అవినాష్ ప్రస్థానం ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన ఈ సీజన్‌లో అందరినీ అలరించి స్టార్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు అవినాష్. తన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మందికి వినోదం పంచాడు. అయితే ట్రోఫీ గెలుకుంటాడనున్న అవినాష్ అన్నయ్య, నాన్నలు కాస్త ఎమోషనల్ అవుతారు. అయితే అవినాష్‌పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు సెల్యూట్ అంటారు.


Click it and Unblock the Notifications











