Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రాణంగా ప్రేమించిన లవర్ హ్యాండిచ్చింది.. ఇక దేనినైనా తట్టుకుంటా.. అరియానాతో అవినాష్ ఎమోషనల్
బిగ్‌బాస్ ఇంటిలో 50వ రోజున 8వ వారానికి ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత వాతావరణం కాస్త గంభీరంగానే కనిపించింది. ఎవరికి వారు ఆలోచనల్లో పడిపోయారు. అరియానాతో అవినాష్ ఎమోషనల్‌గా మాట్లాడారు. అక్కడే ఉన్న మోనాల్.. అవినాష్ ఓ గట్టి షాకిచ్చింది. ఇంతకు అవినాష్, అరియానా, మోనాల్ మధ్య ఏం జరిగిందంటే..
బ్రేకప్ను తట్టుకొన్నాను.. ఇక ఏదైనా సరే
అరియానాతో సరదాగా సాగిన డిస్కషన్ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. నేనే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే నన్ను వదిలేసి పోయింది. అప్పుడే తట్టుకొని నిలబడ్డాను. దానిని భరించాను. దాని ముందు ఏదైనా తట్టుకోగలను అని అరియానాతో అన్నాడు. చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతుండగా, అరియానా సీరియస్‌గా మాట్లాడుతూనే అవినాష్‌పై పంచ్ వేసింది.
ఇది గుర్తుపెట్టుకో.. మున్ముందు చాలా అవసరం
అవినాష్ బ్రేకప్ విషయంపై టాపిక్‌ను కొనసాగిస్తూ.. ఇది గుర్తు పెట్టుకొ. మనకు బాగా పనికి వస్తుంది. నామినేషన్ సమయంలో ఈ పాయింట్ వాడుకోచ్చు అంటే.. అవినాష్ దేనికైనా సిద్ధం అంటూ ఫోజు పెట్టారు. అరియానా, అవినాష్ మధ్య ఇలా డిస్కషన్ కొనసాగుతుండగా పక్కనే ఉన్న అఖిల్‌తో కలిసి కూర్చున్నది.
మైండ్ సెట్ మార్చుకొన్నావు అంటూ అవినాష్
అఖిల్‌తో మోనాల్ గజ్జర్ కూర్చోవడంపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. నీవు ఇక్కడికి వచ్చి కూర్చొంటావని చెప్పావు. కానీ వెళ్లి అఖిల్ పక్కన కూర్చున్నావు అని అవినాష్ సెటైర్ వేశాడు. నీవు మైండ్ సెట్ మార్చుకొన్నావు. నీవు వస్తావని చెప్పావు. అయితే వెళ్లి అఖిల్‌తోనే మాట్లాడుకో అంటూ అవినాస్ సీరియస్ అయ్యాడు.
అవినాష్ నుదుటిపై ముద్దు
దాంతో అఖిల్ వద్ద నుంచి లేచి వచ్చి అవినాష్ నుదటిపై ముద్దు పెట్టింది. దాంతో అవినాష్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. పక్కనే ఉన్న అరియానా కూడా విస్తుపోయి కూర్చొన్నది. మెనాల్ నాకు ఇక్కడ ముద్దు పెట్టింది అంటూ అందరికి నుదురును చూపిస్తూ అవినాష్ సంతోషంలో మునిగిపోయాడు.