బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి: అవినాష్‌ పేరిట నమోదైన రికార్డు.. ఆ కంటెస్టెంట్ వల్లే ఈ పరిస్థితి!

జబర్ధస్త్ అనే షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని.. బెస్ట్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు ముక్కు అవినాష్. ఎన్నో స్కిట్లలో ఉత్తమ నటనతో ఆకట్టుకున్న అతడు.. చాలా తక్కువ సమయంలోనే టీమ్ లీడర్‌గానూ ప్రమోషన్ పొందాడు. ఈ ఫేమ్‌తోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. చాలా రోజుల పాటు హౌస్‌లో ఉన్న అతడు.. తాజాగా ఎలిమినేట్ అయిపోయాడు. తద్వారా అవినాష్ పేరిట ఓ రికార్డ్ నమోదైంది. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి అలా కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఎంట్రీతోనే అంచనాలు పెంచేసిన అవినాష్

ఎంట్రీతోనే అంచనాలు పెంచేసిన అవినాష్

జబర్ధస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన అవినాష్.. బిగ్ బాస్ షోలోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. మూడో వారంలో జోకర్ గెటప్‌తో హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. పరిచయ వీడియోతోనే అంచనాలు పెంచేశాడు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే చాలా వారాల పాటు నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు.

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు సంపాదించాడు

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు సంపాదించాడు

తరచూ ఏదో ఒక గొడవతో మూసగా సాగిపోతోన్న బిగ్ బాస్ షోను తన రాకతో మార్చేశాడు అవినాష్. నిత్యం కామెడీని పంచుతూ కంటెస్టెంట్లు అందరికీ మజాను అందించాడు. అలాగే, హౌస్‌మేట్లు అందరినీ ఇమిటేట్ చేయడంతో పాటు వీకెండ్ ఎపిసోడ్స్‌లో అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ సమంత, నాగార్జున నుంచి బెస్ట్ ఎంటర్‌టైనర్ అని పేరు సంపాదించుకున్నాడు.

ఆరియానాతో ట్రాక్.. బాండింగ్ కుదిరింది

ఆరియానాతో ట్రాక్.. బాండింగ్ కుదిరింది

బిగ్ బాస్ హౌస్‌లో ముక్కు అవినాష్ కంటెస్టెంట్లు అందరితోనూ కలిసి ఉండేవాడు. మరీ ఎక్కువగా అతడు ఆరియానా గ్లోరీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వాడు. ఈ క్రమంలోనే ఆమెను పడేయడానికి ఎన్నో ప్రయత్నాలు సాగించేవాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ బాండింగ్ రోజురోజుకూ పెరగడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.

అలా చెడ్డ పేరు తెచ్చుకున్న కమెడియన్

అలా చెడ్డ పేరు తెచ్చుకున్న కమెడియన్

ఇంట్లో ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే అవినాష్.. నామినేషన్స్ టాస్కులో మాత్రం కొత్తగా కనిపించేవాడు. ఇక, ఎవరైనా తనను నామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోయేవాడు. అంతేకాదు, అతడి స్థాయిని తగ్గించినట్లు ఎవరైనా మాట్లాడితే వింతగా ప్రవర్తించేవాడు. ఇలా తరచూ గొడవలకు దిగుతుండేవాడు. ఈ విధంగా అవినాష్ చెడ్డపేరును కూడా మూటగట్టుకున్నాడు.

అవినాష్‌ పేరిట రికార్డు... అసలు కారణం

అవినాష్‌ పేరిట రికార్డు... అసలు కారణం

13వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ముక్కు అవినాష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఫినాలేకు ఒక వారం ముందు వినోదాన్ని పంచుతూ ఉండే అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్ పేరిట ఓ రికార్డు నమోదైంది. అది కూడా మోనాల్ గజ్జర్ కారణంగా అని తెలుస్తోంది.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు

బిగ్ బాస్ షోలో వరుసగా రెండు వారాలు ఎలిమినేట్ అయ్యాడు అవినాష్. అయితే, గత వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకున్న అతడు.. ఈ వారం ఇంటి నుంచి వెళ్లిపోక తప్పలేదు. ఇలా ఒకే కంటెస్టెంట్ ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా రెండు సార్లు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు. దీంతో అవినాష్ పేరు ఇలా కూడా హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X