కాబోయే భార్యతో అవినాష్ రొమాన్స్.. హఠాత్తుగా మధ్యలో దూరిన శ్రీముఖి.. షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 4లో జోకర్ గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సెట్ చేసుకున్నాడు. అంతకముందు జబర్దస్త్ షో ద్వారా కొన్నాళ్ల పాటు హ్యాపీగానే కొనసాగిన అవినాష్ ఆ తరువాత సడన్ గా లాక్ డౌన్ రావడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత మెల్లగా బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు. ప్రేక్షకుల్లో కూడా ఆదరణ పెరిగిందనే చెప్పాలి. మొత్తానికి అవినాష్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కాబోయే భార్య తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్న అవినాష్ ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ కూడా చేశాడు. ఈ క్రమంలో మధ్యలోకి వచ్చిన శ్రీముఖి కొంటెగా ఒక కామెంట్ కూడా చేసింది.

అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి..

అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లి..

మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నటువంటి ముక్కు అవినాష్ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అయితే ఎంత ప్రయత్నం చేస్తున్న కూడా అతని స్థాయి ఒక లెవెల్లోనే ఆగిపోయింది. ఇక ఎలాగైనా తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ రాగానే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకున్నాడు.

త్వరలోనే పెళ్లి..

త్వరలోనే పెళ్లి..

బిగ్ బాస్ అనంతరం అతని లైఫ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. భారీగా ఆదాయం అందుకోవడమే కాకుండా సొంతంగా ఓ ప్రత్యేకమైన ఇంటిని కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం కొన్ని షోలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ వేడుకను పూర్తి చేసుకున్నాడు.

రొమాంటిక్ ఫోటో షూట్

రొమాంటిక్ ఫోటో షూట్

ఇక తనకు కాబోయే భార్య అనూషకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇటీవల అవినాష్ తన పుట్టినరోజు సందర్భంగా సన్నిహితులకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు. ఇక కాబోయే సతీమణితో ప్రత్యేకంగా ఫోటో షూట్ కూడా నిర్వహించాడు. తన ప్రేయసి అనుజతో అవినాష్ రొమాంటిక్ స్టిల్స్ ఇచ్చాడు.

రొమాన్స్ మధ్యలో శ్రీముఖి సెటైర్

రొమాన్స్ మధ్యలో శ్రీముఖి సెటైర్

అయితే అవినాష్ అనుజ ఇద్దరు కూడా ప్రేమగా స్టిల్ ఇస్తుండగా మధ్య లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి సరదాగా ఆట పట్టించింది. అవినాష్ అనుజ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకుంటూ అండగా అప్పుడే వచ్చిన శ్రీముఖి హ్యాపీ బర్త్ డే అవినాష్ హ్యాపీ బర్త్ డే అనుజ అంటూ నవ్వుతూ ఆట పట్టించింది. మళ్లీ ఆ తర్వాత బిజీగా ఉన్నారా అంటూ కొంటెగా కౌంటర్ వేసింది.

శ్రీముఖి చేసిన సహాయం

శ్రీముఖి చేసిన సహాయం

శ్రీముఖి అవినాష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ రెగ్యులర్ గా శ్రీముఖికి సంబంధించిన షోలల్లో కూడా కనిపిస్తుంటాడు. బిగ్ బాస్ లోకి వెళ్లేముందు జబర్దస్త్ నిర్వాహకుల నుంచి NOC తీసుకునేందుకు అవినాష్ గట్టిగా ప్రయత్నం చేశాడు. జబర్దస్త్ నిర్వాహకులకు లక్షల్లో డబ్బు కట్టాల్సివచ్చింది. ఇక అప్పుడు శ్రీముఖి అవినాష్ కు అండగా నిలిచింది. ఆమె చేసిన సహాయాన్ని అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు కూడా. ఇక అవినాష్ పెళ్లి లో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X