అవినాష్‌కు బిగ్ షాక్: సేవ్ అయినా తప్పని నిరాశ.. ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు!
బుల్లితెరపైనే అత్యంత ప్రజాధరణ పొందిన షోలలో జబర్ధస్త్ ఒకటి. ఆ షో ద్వారా వెలుగులోకి రావడంతో పాటు స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలంగా తన మార్క్ చూపిస్తూ టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. అందరికీ వినోదాన్ని పంచుతున్న అతడు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. అయినా అతడికి బిగ్ షాక్ తప్పలేదు. ఆ సంగతులేంటో మీరూ చూడండి!
Recommended Video

ఎంట్రీతోనే అదరగొట్టేసిన అవినాష్
జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్. అతి తక్కువ కాలంలోనే టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన ఈ యంగ్ కమెడియన్.. ఆ షోలో సత్తా చాటాడు. దీని ద్వారా వచ్చిన పాపులారిటీతో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. జోకర్ గెటప్‌తో తయారు చేసిన ఏవీతో అతడు మూడో వారం ఇంట్లోకి ప్రవేశించాడు.

బెస్ట్ ఎంటర్‌టైనర్ అని ప్రశంసలు
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పటి నుంచి అవినాష్ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైన కామెడీని పంచుతూ హౌస్‌మేట్స్ అందరినీ నవ్విస్తున్నాడు. పెళ్లి సంబంధాలు అంటూ తరచూ కామెంట్లు చేసిన సందడి చేస్తున్న జబర్ధస్త్ కమెడియన్.. ఆరియానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.

నామినేషన్స్... ప్రత్యేక అధికారం
12వ వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్కులో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, ఆరియానా గ్లోరీలతో పాటు అవినాష్ నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత వీళ్ల నలుగురి కోసం బిగ్ బాస్ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్' అనే ఆఫర్ తీసుకొచ్చాడు. దీన్ని గెలుపొందిన ఇంటి సభ్యుడు రెండు వారాల్లో ఎప్పుడైనా ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు. దీన్ని అవినాష్ గెలుచుకున్నాడు.

ఎలిమినేషన్ తప్పించుకున్నాడు
గత వారం నామినేట్ అయిన నలుగురిలో మోనాల్ గజ్జర్ సేవ్ అయినట్లు నాగార్జున శనివారమే ప్రకటించాడు. ఆ తర్వాత అఖిల్ ఎలిమినేషన్ తప్పించుకున్నాడు. దీంతో ఇద్దరు కంటెస్టెంట్లు మిగిలారు. ఈ సందర్భంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటావా అని నాగార్జున అవినాష్‌ను ప్రశ్నించాడు. దానికి అతడు ఓకే చెప్పాడు. ఫలితంగా ఈ ఎలిమినేషన్ తప్పించుకున్నాడు.

సేవ్ అయినా నిరాశ తప్పలేదుగా
అవినాష్ ఎవిక్షన్ పాస్ ఉపయోగించుకున్న తర్వాత.. ఎవరు ఎలిమినేట్ అయ్యారన్నది పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఆరియానా సేవ్ అవగా.. అవినాష్ ఎలిమినేట్ అయినట్లు తేలింది. దీంతో పాస్ వల్ల అతడు సేవ్ అయినా ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఎలిమినేట్ అయినట్లు అయింది. ఈ ప్రాసెస్ తర్వాత అవినాష్ చాలా బాధ పడ్డాడు. అంటే సేవ్ అయినా నిరాశకు లోనయ్యాడు.

ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు
ఆ తర్వాత మాట్లాడుతూ ‘ప్రేక్షకుల అభిప్రాయంలో నేను ఎలిమినేట్ అయిపోయినట్టే.. ముందుకు వెళ్లాలా ఆగాలా తెలియడం లేదు' అన్నాడు. ‘ఎంత ఆడినా..' అంటూ ఆ సమయంలోనే ఓటింగ్ సిస్టమ్‌పై పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశాడు. దీంతో నాగార్జున అతడికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. ‘ఉన్న వారిలో నీకు తక్కువ వచ్చాయి. నువ్వేమీ ఫీల్ అవకు' అని ఓదార్చాడు.


Click it and Unblock the Notifications











