బాబా భాస్కర్-యానీ మాస్టర్‌ల కొత్త కహాని.. సిగ్గు, మానం లేదా అంటూ యాంకర్ రవి ఫైర్

బుల్లితెరపై ఓ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్, షో అంటే అందులో కచ్చితంగా పులిహోర బ్యాచ్ ఉండాల్సిందేనన్న అభిప్రాయం ఏర్పడింది. అలాంటి ట్రాకులు లేకపోతే షో, ఈవెంట్లు హిట్ కావని గట్టిగానే ఫిక్స్ అయ్యారు. అందుకు ఈ దసరాకు రాబోతోన్న స్పెషల్ ఈవెంట్లలో అన్నీ ఈ బ్యాచ్‌లే ఈ కనిపిస్తున్నాయి. ఈ టీవీలో రాబోతోన్న అక్కా ఎవరే అతగాడు, స్టార్ మాలో జాతరోజాతర, జీ తెలుగులో చి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అంటూ ఏకంగా వీరితోనే పులిహోర కలిపించేయిస్తున్నారు.

జాతరో జాతర..

జాతరో జాతర..


స్టార్ మాలో మామూలుగా స్పెషల్ ఈవెంట్ అంటే సీరియల్ సభ్యులే వస్తారు. మా పరివార్ మొత్తం ఈవెంట్లలో సందడి చేస్తుంది. వారితో పాటు కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా వస్తారు. ఇలా ఈ అందరితో కలిపి స్పెషల్ ఈవెంట్‌ను కన్నులపండువగా సెలెబ్రేట్ చేస్తుంటారు. ఈ దసరాకు వీరంతా కలిసి జాతరో జాతర అనే ఈవెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.

వంటలక్క స్పెషల్..

వంటలక్క స్పెషల్..

కార్తీకదీపం ఫేమ్ వంటలక్క, దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ బయట ఎక్కడా కూడా అంతగా కనిపించదు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అంటూ మీడియాలోనూ హడావిడి చేయదు. కానీ మొదటిసారిగా ప్రేమీ విశ్వనాథ్ ఈ ఈవెంట్‌లో అమ్మోరుగా కనిపించి తన విశ్వరూపాన్ని చూపించింది.

బాబా భాస్కర్ రచ్చ..

బాబా భాస్కర్ రచ్చ..

బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. ఈ విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతానికి ముగ్గురు టాప్ కొరియోగ్రాఫర్స్ మూడు చానెళ్లను కవర్ చేస్తున్నారు. ఈటీవీలో శేఖర్ మాస్టర్, స్టార్ మాలో బాబా, జీ తెలుగులో జానీ మాస్టర్ దసరా ఈవెంట్లలో హల్చల్ చేసేందుకు రెడీ అయ్యారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
యానీ మాస్టర్‌తో పులిహోర..

యానీ మాస్టర్‌తో పులిహోర..


బాబా మాస్టర్‌కు ఆల్రెడీ పెళ్లైంది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంగతి అందరికీ తెలిసింది. అయితే రవి మాత్రం ఏదో స్కిట్ కోసం బాబాను పెళ్లి కాలేదని అన్నట్టున్నాడు. ఇక బాబా భాస్కర్‌ యానీ మాస్టర్‌తో పులిహోర కలిపేందుకు రెడీ అయ్యాడు. ఆ క్రమంలోనే యానీ మాస్టర్‌తో హద్దులు దాటేందుకు ప్రయత్నిస్తుండగా..మధ్యలో వచ్చిన యాంకర్ రవి సిగ్గు మానం లేదా అంటూ బాబాపై ఫైర్ అయ్యాడు. తనకు అలాంటివేమీ లేవని బాబా సైతం రెచ్చిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X