ఎవ్వరినీ వదలడం లేదు.. ప్రియమణితో అలా, పూర్ణతో ఇలా.. బాబా భాస్కర్ రచ్చ రచ్చ

బాబా భాస్కర్ ఢీ షోకు జడ్జ్‌గా వస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు వారాలుగా షోలో నానా హంగామా చేస్తున్నాడు. షో మొత్తం బాబా భాస్కర్‌ రచ్చే కనిపిస్తోంది. ఎవ్వరినీ వదలడం లేదు. ప్రతీ ఒక్కరినీ తన సెటైర్లతో నోర్మూయిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ కరోనా వల్ల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకు ఆ ప్లేస్‌లో బాబా మాస్టర్‌ను తీసుకున్నారు. అంతకు ముందు యానీ మాస్టర్‌ను తీసుకున్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో బాబాను రంగంలోకి దించారు.

బాబా రాకతో రచ్చ..

బాబా రాకతో రచ్చ..

బాబా మాస్టర్ ఏ షోలో అడుగుపెడితే అక్కడ అంతా సందడి సందడిగా ఉండాల్సిందే. బిగ్ బాస్ షోలో బాబా చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పైగా బుల్లితెరపై ఏదైనా షో, ప్రత్యేక ఈవెంట్లలో బాబాను పిలిస్తే అక్కడ ఎంటర్టైన్మెంట్‌ను టన్నుల్లో ఇస్తాడు. అదే విధంగా ఇప్పుడు ఢీషోను ఓ ఆట ఆడుకుంటున్నాడు.

అందరిపై పంచులు..

అందరిపై పంచులు..

ఢీ షోలో డ్యాన్సుల సంగతి పక్కన పెడితే.. కామెడీ స్కిట్స్, సెటైర్స్, రొమాన్స్ వీటికి మాత్రం కొదవలేదు. రష్మీ సుధీర్, వర్షిణి హైపర్ ఆది, ప్రదీప్‌లపై బాబా భాస్కర్ ఓ రేంజ్‌లో కౌంటర్లు వేస్తున్నాడు. ఇక మరీ ముఖ్యంగా సుధీర్‌కు కంటి మీద కునుకు లేకుండా వరుసగా సెటైర్లు వేస్తున్నాడు.

ప్రియమణితో రొమాన్స్..

ప్రియమణితో రొమాన్స్..

బాబా భాస్కర్ ప్రియమణితో వేసిన రొమాంటిక్ స్టెప్పులకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సఖి సినిమాలోని పచ్చందనమే పచ్చదనమే అంటూ బాబా భాస్కర్.. ప్రియమణితో రొమాంటిక్ పర్ఫామెన్స్ వేశాడు. ఆమె కాళ్లు, మొహం, బుగ్గలు, చెవులు జుంకాలు నిమురుతూ రచ్చ రచ్చ చేశాడు.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
 ఇక పూర్ణతోనూ...

ఇక పూర్ణతోనూ...

వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలో పూర్ణతో మాస్టర్ రెచ్చిపోయి స్టెప్పులేసినట్టు కనిపిస్తోంది. మన్మథ రాజా మన్మథ రాజా అంటూ స్టేజ్ మీద మాస్ స్టెప్పులను ఇరగదీశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X