ఇదో తొక్కలో షో.. ఆవేశంతో రెచ్చిపోయిన బాబా భాస్కర్.. నాగబాబు షాక్

బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడే సందడే సందడి. దాదాపు బాబా భాస్కర్‌కు కోపమన్నదే రాదు. బాబా భాస్కర్‌కు కోపానికి మధ్య అంతులేనంత దూరం ఉంటుంది. అయితే బాబా ఉన్న చోట మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ఈ విషయాన్ని మనం బిగ్‌బాస్ మూడో సీజన్‌లో చూశాం. ఓ రెండు మూడుసార్లు బాబా ఎమోషనల్ అయ్యాడే తప్పా ఏనాడు ఎవరి మీదకు ఫైర్ కాలేదు. తాజాగా బాబా భాస్కర్ అదిరింది షోలో దుమ్ములేపాడు.

అదిరింది స్పెషల్..

అదిరింది స్పెషల్..

అదిరింది 25వ ఎపిసోడ్ సందర్భంగా టీం లీడర్స్, కంటెస్టెంట్లందరూ రెచ్చిపోయారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లకైతే కొదవే లేదు. సద్దాం, వేణు, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర స్కిట్స్ అన్ని ఒకెత్తు అయితే బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ ప్రెస్ హరి స్కిట్‌ను ఓ రేంజ్‌లో లేపాడు.

బాబా పంచ్‌లు..

బాబా పంచ్‌లు..

ఎక్స్ ప్రెస్ హరి స్కిట్‌లో భాగంగా ఓ డ్యాన్స్ ప్రోగ్రాంను చేశాడు. అందులో కంటెస్టెంట్ జోడిగా పండు, యాదమ్మ రాజు ఎంట్రీ ఇచ్చారు. ఇక జడ్జ్‌లుగా తన్మై, బాబా భాస్కర్ వచ్చారు. ఎంట్రీ ఇస్తూనే అదిరిపోయే సెటైర్ వేశాడు. మీరు వస్తే కన్నులపండుగ్గా ఉంటుందని ఎక్స్‌ప్రెస్ హరి అనడంతో.. పండుగా ముందుగా చెబితే మంచి డ్రెస్ వేసుకునే వాడిని కదరా అని కౌంటర్ వేస్తాడు. మాస్టర్ మీరు కామెడీ చేస్తున్నారని హరి అనడంతో.. మరి మీరు చేయడం లేదు కదరా అంటూ మరో కౌంటర్ వేసేశాడు.

ఎక్కువ చేయకు..

ఎక్కువ చేయకు..

ఢీ షో మాదిరిగా వీరు ఆ స్కిట్‌ను కంటిన్యూ చేశారు. ఇక జడ్జ్‌గా వచ్చిన తన్మై రెచ్చిపోవడంతో నీకు ఎంత ఇచ్చారు అని బాబా సెటైర్ వేశాడు. 20 వేలు అని తన్మై అనడంతో నాకు 21 వేలు, పార్క్ హయత్ హోటల్, ఫ్లైట్ ఇవన్నీ ఇచ్చారు. 20వేల పర్ఫామెన్స్ చేయ్ ఎక్కువ చేయకు అంటూ సెటైర్ వేశాడు.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
తొక్కలో షో..

తొక్కలో షో..

ఇక జడ్జ్‌మెంట్‌లో భాగంగా పండు ఎలిమినేట్ అని చెప్పడంతో లేడీ గెటప్‌లో ఉన్న తన జోడి యాదమ్మను తీసుకుని వెళ్తుంటాడు. నువ్ ఎలిమినేట్ ఫ్రూటీ కాదు అని బాబా భాస్కర్ అంటాడు. అది నా జోడి అంటూ పండు బదులిస్తుండగా... నువ్వారా జడ్జ్ నేనా? నాకిస్తున్నారు 20 వేలు నీకిస్తున్నారా? తొక్కలో షో.. ఇది నేను చేయనుపోరా అని స్టేజ్ దిగి వెళ్లిపోయాడు. దీంతో నాగబాబు కూడా షాక్ అయ్యాడు. మళ్లీ వెంటనే పైకి వచ్చి డైరెక్టర్ ప్రోమో ఓకే కదా అంటూ సెటైర్ వేయడంతో నాగబాబు పగలబడి నవ్వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X