అలా చేస్తే చండాలంగా ఉంటుంది.. ‘బుట్టబొమ్మ’పై బాబా భాస్కర్ కామెంట్స్ వైరల్
బాబా భాస్కర్ బుల్లితెరపై చేసే హల్చల్ గురించి అందరికీ తెలిసిందే. బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు బాబా భాస్కర్ డ్యాన్స్ ప్లస్ షోలో రచ్చ రచ్చ చేస్తూ ఉన్నాడు. బాబా భాస్కర్ తన దైన శైలిలో ఇచ్చే జడ్జ్ మెంట్.. మెంటర్లతో కలిసి వేసే డ్యాన్సులు అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక తన తోటీ జడ్జ్‌లపై బాబా వేసే పంచ్‌లు ఓ రేంజ్‌లో పేలుతుంటాయి.

డ్యాన్స్ ప్లస్‌లో అలా..
డ్యాన్స్ ప్లస్ షోను ఓంకార్ ముందుండి నడిపిస్తున్నాడు. ఇందులో ఆరుగురు జడ్జ్‌లున్నారు. రఘు, బాబా, యానీ, యశ్, ముమైత్ ఖాన్, మోనాల్ ఇలా ఆరుగురు న్యాయ నిర్ణేతలను పెట్టి ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోను బాగానే లాక్కొస్తున్నాడు. మధ్య మధ్యలో సెలెబ్రిటీలను తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

మోనాల్, యశ్ రచ్చ..
డ్యాన్స్ ప్లస్ షోలో కంటెస్టెంట్లు చేసే డ్యాన్సులకంటే న్యాయ నిర్ణేతలు చేసే హడావిడి ఎక్కువగా ఉంటోంది. ఇక మోనాల్ యశ్ మాస్టర్ రఘు మాస్టర్‌లు చేసే హల్చల్ మామూలుగా ఉండదు. మరీ ముఖ్యంగా మోనాల్ యశ్ మధ్య ఓ ట్రాక్ క్రియేట్ అయ్యేలా కూడా చేస్తుంటారు.

తాజాగా అలా..
మోనాల్ యశ్ మాస్టర్ మధ్య ఎప్పుడూ డ్యాన్స్ పర్ఫామెన్స్ పెడుతుంటారు, కామెడీ స్కిట్లు చేయిస్తుంటారు. తాజాగా బుట్టబొమ్మ పాటకు మోనాల్ యశ్ మాస్టర్ అదిరిపోయేలా డ్యాన్స్ వేశారు. జూనియర్లు అదరగొట్టేశారు.. ఇక ఇదే స్టెప్పులను సీనియర్స్ (బాబా భాస్కర్, యానీ) కూడా వేయాలని ఓం కార్ చెప్పుకొచ్చాడు.
చండాలంగా ఉంది..
బాబా భాస్కర్, యానీ మాస్టర్‌లను బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేయాలని ఓం కార్ అనగానే.. అలా చేస్తే చండాలంగా ఉంటుందని బాబా భాస్కర్ కామెంట్ చేశాడు. మాకు వేరేలా పాట పెట్టాలని బుట్ట బొమ్మ అంటూ ముసలావాళ్లలా డ్యాన్స్ చేశాడు. మొత్తానికి యానీ మాస్టర్, తన వయసు మీద బాబా సెటైర్ వేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











