హౌస్‌మేట్స్‌కు చుక్కలు చూపించిన బాబా భాస్కర్.. తట్టుకోలేక దండం పెట్టేశారు

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఫన్నీ టాస్కులు క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వహకులు.

ఇందులో భాగంగానే లగ్జరీ బడ్జెట్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చే వీక్లీ టాస్క్‌ నిర్వహించారు. దీని ప్రకారం.. హౌస్‌లోని కొందరు గార్డెన్ ఏరియాలో ఉన్న ట్రైన్ సెట్టింగ్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో కొందరు కంటెస్టెంట్లకు బాస్ కొన్ని పాత్రలను కేటాయించాడు. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి - రవిని హానీమూన్ కపుల్స్ చేశాడు బిగ్ బాస్. వీళ్లిద్దరూ హనీమూన్ కోసం ట్రైన్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ట్రైన్ డ్రైవర్లుగా రాహుల్, వరుణ్ ఉంటారు. అలాగే ఇదే ట్రైన్‌లో టీ అమ్మే వ్యక్తిగా బాబా భాస్కర్ వ్యవహరిస్తాడని బిగ్ బాస్ చెప్పాడు.

Baba Bhaskar Funny Skit In Bigg Boss House

ఇక, తాజాగా విడుదలైన ప్రోమోలో.. బాబా భాస్కర్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు చుక్కలు చూపించడం కనిపించింది. రైళ్లోని ప్రయాణికులందరూ బాబా భాస్కర్ గురించి చెప్పమని అడుగుతారు. దీంతో ఆయన తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే, మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే తన కథను మొదటి నుంచి చెబుతానంటూ వెల్లడిస్తాడు.

ఇందులో భాగంగానే బాబా తన కథ చెబుతున్న క్రమంలో హౌస్‌మేట్స్ ఏదో ఒకటి అనడం.. ఆయన మొదటి నుంచి చెప్పడం కనిపించింది. ఆయనను తట్టుకోలేక కొందరు దండం కూడా పెట్టేస్తారు. దీంతో గురువారం ఎపిసోడ్ సరదాగా గడిచిపోతుందని అర్థమవుతోంది. ఈ ప్రోమో చూసిన తర్వాత చాలా మందిలో షోపై ఆసక్తి పెరిగిందనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X