twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థూ అంటూ చీదరించుకున్న బాబా భాస్కర్.. రవి లాస్యను ఘోర అవమానం!

    |

    బుల్లితెరపై బాబా భాస్కర్ వచ్చాడంటే అక్కడంతా నవ్వుల పంట పండాల్సిందే. అవతలి వారు ఏం అనుకుంటారని కూడా చూడకుండా సెటైర్లు వేస్తుంటాడు. బాబా భాస్కర్ చేసే ఇమిటేషన్, వేసే సెటైర్లు, చేసే అల్లరి వీక్షకులను ఆకట్టుకుంటుంది. అలా బిగ్ బాస్ ఇంట్లో బాబా భాస్కర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై బాబా భాస్కర్ హవా కొనసాగుతోంది.

    జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

    ఆ మధ్య అలా..

    ఆ మధ్య అలా..

    ఆ మధ్య శేఖర్ మాస్టర్‌కు కరోనా రావడంతో ఢీ షోకు కొన్ని వారాల పాటు బాబా భాస్కర్ జడ్జ్‌గా వ్యవహరించాడు. తనదైన శైలిలో మార్క్‌ను చూపిస్తూ జడ్జ్‌గా రచ్చ చేశాడు. లేడీ జడ్జ్‌లతో మాస్, రొమాంటిక్ పర్ఫామెన్స్ చేస్తూనే అందరి మీద పంచ్‌లు వేసేశాడు.

    ఇప్పుడు ఇలా..

    ఇప్పుడు ఇలా..

    ఇప్పుడు బాబా భాస్కర్ ఓ షోలో జడ్జ్‌గా రచ్చ చేస్తోన్న విషయం తెలిసిందే. డ్యాన్స్ ప్లస్ అంటూ వస్తోన్న ఈ షోలో బాబా భాస్కర్ ఇచ్చే జడ్జ్మెంట్, తన కంటెస్టెంట్లతో వేసే మాస్ స్టెప్పులు, తోటి జడ్జ్‌లైన మోనాల్, ముమైత్, యానీ మాస్టర్‌లతో చేసే హల్చల్ గురించి అందరికీ తెలిసిందే.

    కామెడీ స్టార్స్‌లో గెస్ట్‌గా..

    కామెడీ స్టార్స్‌లో గెస్ట్‌గా..

    తాజాగా బాబా భాస్కర్ కామెడీస్టార్స్‌లో గెస్ట్‌గా వచ్చాడు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న కామెడీ స్టార్స్‌లో బాబా భాస్కర్ సందడి చేయబోతోన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమోను వదిలారు. ఇందులో బాబా మాస్టర్ హైలెట్ అయ్యాడు.

    గతవారమే అలా..

    గతవారమే అలా..

    అసలే కామెడీ స్టార్స్ షోలో ఈ మధ్య జంటలు ఎక్కువగా తయారయ్యారు. ఎక్స్ ప్రెస్ హరి అషూ, యాంకర్ రవి లాస్యలు కలిసి దుమ్ములేపుతున్నారు. చాలా ఏళ్ల తరువాత ఇలా మళ్లీ ఆన్ స్క్రీన్ మీద రవి లాస్య కలిసి రొమాంటిక్ పర్ఫామెన్స్‌లతో రెచ్చిపోతోన్నారు. అలాంటి వారి పర్ఫామెన్స్ చూసి బాబా భాస్కర్ దారుణంగా అవమానించేశాడు.

    థూ అంటూ..

    థూ అంటూ..

    గత వారంలానే రవి లాస్య ఈ సారి కూడా ఓ పాటకు స్టెప్పులు వేశారు. వాటిని నాన్ సింక్‌లో ఇష్టమొచ్చినట్టుగా చేయడంపై బాబా భాస్కర్ హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. వారి పర్ఫామెన్స్‌ను చూడలేక బాబా భాస్కర్ లేచివెళ్లిపోయాడు. చివర్లో థూ అంటూ రవి, లాస్య పరువుతీసేశాడు. అయితే కేవలం ప్రోమో కోసమా? లేదా షోలో నిజంగానే అలా చేశాడా? అన్నది చూడాలి.

    English summary
    Baba bhaskar Insult Ravi And Lasya Dance Performance
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X