twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ.20 పర్ఫామెన్స్ మాత్రమే చెయ్.. యాంకర్ రవి పరువుదీసిన బాబా భాస్కర్

    |

    బాబా భాస్కర్ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ షోలో బాబా భాస్కర్ అందరినీ ఎంతలా నవ్వించాడు.. ఏడిపించాడో అందరం చూశాం. సీజన్ మొత్తంలో బాబా భాస్కర్ ఓ రెండు మూడు సార్లు కంటతడి పెట్టి ఉంటాడు. కానీ మిగతా అన్ని చోట్లా బాబా భాస్కర్ అందరినీ నవ్వించాడు. బయటకు వచ్చాక నాన్ స్టాప్ నవ్వులను పంచాడు. ఏదైనా షోలో గెస్ట్‌గా వచ్చినా, ఈవెంట్‌లో పాల్గన్నా బాబా భాస్కర్ చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది.

     స్పెషల్ ఈవెంట్లలో..

    స్పెషల్ ఈవెంట్లలో..

    దీపావళి, దసరా వంటి ఈవెంట్లలో బాబా భాస్కర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. స్టార్ మా టీం ప్రతీ పండుగకు ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంటుంది. అందులో తమ సీరియల్ నటీనటులను, బిగ్ బాస్ కంటెస్టెంట్లను గెస్ట్‌లుగా పిలుస్తూ ఉంటుంది.

     యాంకర్ రవి సైతం..

    యాంకర్ రవి సైతం..

    అయితే ప్రతీ ఈవెంట్‌లో యాంకర్ రవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. యాంకర్ రవి హోస్ట్‌గా షోను ముందుకు నడిపిస్తుంటాడు. అలా ప్రతీ ఈవెంట్‌లో యాంకర్ రవి రావడం అందులో బాబా భాస్కర్ కూడా ఉండటంతో ఇద్దరికీ బాగా సింక్ కుదిరింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే కామెడీ బాగానే క్లిక్ అవుతుంది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    ఈ సంక్రాంతికి ఇట్సే ఫ్యామిలీ పార్టీ అంటూ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా గెస్ట్‌లు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకొచ్చారు. అన్నింటి కంటే ముఖ్యంగా రవి, లాస్య ఒకే స్టేజ్ మీద కనిపించారు. ఐదేళ్ల తరువాత ఇద్దరూ కూడా ఒకే షోలో కనిపించారు. కలిసి యాంకరింగ్ చేశారు.

    రవి ఎమోషనల్..

    రవి ఎమోషనల్..

    స్టేజ్ మీదున్న రవి.. లాస్య రాకను గమనించి ఎమోషనల్ అయ్యాడు. తెగ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అంతలోపే బాబా భాస్కర్ వచ్చి లాస్ట్ ఈవెంట్‌లో నీకు ఎంత ఇచ్చార్రా? అని రవిని అడిగాడు. రెండు లక్షలు.. అని చెప్పబోతుండగా.. కరెక్ట్‌గా చెప్పురా అని బాబా భాస్కర్ బెదిరించడంతో 20 రూపాయలని చెప్పాడు రవి. ఆ 20 రూపాయలకు తగ్గ పర్ఫామెన్స్ చేయ్ చాలు అంటూ అందరి ముందే రవి పరువుదీసేశాడు.

    English summary
    Baba Bhaskar Satires On Anchor Ravi In It's a Family Party
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X