అయ్యో పాపం ఆ ఇద్దరూ బలి.. సుధీర్ వేస్ట్, రష్మీ డబుల్ వేస్ట్.. పరువు తీసేసిన బాబా భాస్కర్
బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ. ఆయన ఉంటే చాలు నవ్వులపూదోట విరబూస్తుంది. బిగ్‌బాస్ షోలో బాబా మాష్టర్ చేసిన సందడిని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోల్లో బాబా చేసిన సందడి అంతా ఇంతా ఉండదు. బాబా వేసే కౌంటర్లకు ఎవ్వరైనా సరే నిలవరు. బాబా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చాడంటే ఎవ్వరైనా సరే వెనక్కి జరగాల్సిందే. తాజాగా బాబా మాస్టర్ ఢీ షోకు జడ్జ్‌గా విచ్చేశాడు.

శేఖర్ మాస్టర్‌కు కరోనా..
శేఖర్ మాస్టర్‌కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వచ్చింది, నెగెటివ్ రావడంతో హాస్పిటల్ జాయిన్ అయ్యానని, చికిత్స తీసుకున్నానని తెలిపాడు. అంతేకాకుండా ప్లాస్మా కూడా దానం చేశానని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. అందుకే శేఖర్ మాస్టర్ స్థానంలో బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు.

బాబా ఎంట్రీతో..
ఢీ వేదికపై బాబా ఎంట్రీతోనే పంచ్‌ల వర్షం కురిపించాడు. డ్యాన్స్ చేసి చేసి బాబా కిందపడగానే వాటర్ వాటర్ అని యాంకర్ ప్రదీప్ అనడంతో.. వద్దు వద్దు అంత ముసలోడిని అవ్వలేదమ్మా అంటూ ఓ అదిరిపోయే సెటైర్ వేశాడు. ఇక ఆది, వర్షిణి, రష్మీ, సుధీర్ వేసిన స్కిట్స్, సిగ్నేచర్ మూమెంట్స్‌కు బాబా వేసిన పంచ్‌లు ఓ రేంజ్‌లో పేలాయి.

పాపం సుధీర్ పరిస్థితి..
కంటెస్టెంట్ వేసిన డ్యాన్సులకు సుధీర్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో బాబా ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. వాళ్లు అంత కష్టపడి మంచి పెర్ఫామెన్స్ చేస్తుంటే కరోనా పేషెంట్‌లా కదలకుండా కూర్చుంటావ్ ఏంట్రా.. ఫైల్స్ ఏమైనా ఉన్నాయా?? అంటూ వరుసగా కౌంటర్లు వేస్తూనే వచ్చాడు.

వేస్ట్, డబుల్ వేస్ట్..
ఇక సుధీర్ బాబా వేసిన కౌంటర్లకు రియాక్ట్ అవుతూ.. ఎయ్ కొట్టు.. గుద్దు గుద్దు, ఎయ్ అంటూ రెచ్చిపోయి ప్రోత్సహిస్తుండటంతో బాబా మళ్లీ కౌంటర్ వేశాడు. నువ్వు వేస్ట్.. రష్మి డబుల్ వేస్ట్.. వర్షిణి వచ్చి టోటల్ వేస్ట్ అంటూ అందరి పరువు తీసేశాడు. ఇక ప్రోమోలోనే ఇలా ఉంటే పూర్తి ఎపిసోడ్‌లో ఏ రేంజ్‌లో ఆడుకుని ఉంటాడో.
Recommended Video
డబ్బులిచ్చి మరీ రావొచ్చు..
ఇక ప్రోమో చివర్లో ఢీ షో గురించి బాబా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.. ఈ షో చూస్తే ఏం చేస్తున్నార్రా.. అబ్బా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి డాన్స్ షోలకు జడ్జీలను డబ్బులు ఇచ్చి తీసుకుని వస్తారు.. కానీ ఈ షోకి మనం డబ్బులు ఇచ్చి రావాలి.. ఢీ అద్భుతమైన షో అంటూ ఆకాశానికెత్తేశాడు.


Click it and Unblock the Notifications











