అసలు ‘ఢీ’లో వీడు చేసే పనేంటి?.. సుధీర్‌కు రెమ్యూనరేషన్ ఇవ్వడం ఎందుకంటూ బాబా భాస్కర్ ఫైర్

సుడిగాల్ సుధీర్‌ను బుల్లితెరపై అందరూ ఎలా ఆడుకుంటారో వాడుకుంటారో అందరికీ తెలిసిందే. అది జబర్దస్త్ అయినా ఎక్స్‌ట్రా జబర్దస్త్ అయినా.. ఢీ అయినా ఇంకే వేరే స్పెషల్ ఈవెంట్ ఏదైనా సరే సుధీర్ స్పెషల్ అట్రాక్షన్ అవుతాడు. అతడ్ని అందరూ కలిసి పిచ్చొడ్ని చేస్తారు. కానీ చివరకు షోకు ఈవెంట్‌ను హిట్ చేసేస్తారు. అదే మరి సుడిగాలి సుధీర్‌కు ఉన్న ఫాలోయింగ్. అలాంటి సుధీర్ మీద బాబా భాస్కర్ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశాడు.

ఢీ షోలో బాబా హల్చల్..

ఢీ షోలో బాబా హల్చల్..

శేఖర్ మాస్టర్‌కు కరోనా రావడంతో ఢీ షోకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. మధ్యలో యానీ మాస్టర్ గెస్ట్‌గా చేసింది. ఇక ముగ్గురు ఆడ జడ్జ్‌లే కావడంతో అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే ఎంటర్టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన బాబా మాస్టర్‌ను రంగంలోకి దించారు. ఈ వారం ఎపిసోడ్‌లో బాబా చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.

సుధీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు..

సుధీర్‌ను ఓ ఆట ఆడుకున్నాడు..

కంటెస్టెంట్లు అదిరిపోయే పర్ఫామెన్స్ చేస్తే కూడా సైలెంట్‌గా ఉన్నావేంటి. ఎంకరేంజ్ చేయవా? అంటూ సుధీర్‌ను ఓ రౌండ్ వేసుకున్నాడు. నువ్ ఎంత చేసినా వేస్ట్, రష్మీ డబుల్ వేస్ట్, వర్షిణి టోటల్ వేస్ట్ అంటూ అందరి మీదా సెటైర్ వేశాడు. ఇక వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

రొమాన్స్‌తో రచ్చ..

రొమాన్స్‌తో రచ్చ..

బాబా భాస్కర్ అంటే మాస్ అని అందరూ ఊహించారు. కానీ ప్రియమణితో వేసిన స్టెప్పులతో బాబాలోని రొమాన్స్ బయటకు వచ్చింది. పచ్చందనమే పచ్చదనమే అంటూ ప్రియమణితో చేసిన హాట్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఇది హైలెట్ అయ్యేలానే కనిపిస్తోంది.

చేసే పని ఏంటి?

చేసే పని ఏంటి?

సుధీర్ ఢీ షోలో చేసే పని ఏంటి అంటూ మాస్టర్ ఓ అంశాన్ని లేవనెత్తాడు. ఆ కుర్చీలో కూర్చుని అలా చూస్తుంటాడు.. తరువాత కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే అటు ఇటూ చూస్తాడు.. వీడు ఢీ షోలో చేసే పని ఏంటి? ఇందుకేనా వీడికి రెమ్యూనరేషన్ ఇచ్చేది అంటూ బాబా సెటైర్ వేశాడు. దీంతో అందరూ ఫక్కున నవ్వేశారు.

పూర్ణ హైలెట్..

పూర్ణ హైలెట్..

బాబా, ప్రియమణి చేసిన డ్యాన్సులకు పూర్ణ అదిరిపోయే జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ పర్ఫామెన్స్‌కు బాబా భాస్కర్, ప్రియమణి, శేఖర్ మాస్టర్‌లు జడ్జ్‌లు అయితే ఎలా నిర్ణయాన్ని ప్రకటిస్తారో పూర్ణ యాక్ట్ చేసి చూపించింది. అందరిలా బాగా ఇమిటేట్ చేసి నవ్వించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X