బాబా భాస్కర్ అలా శేఖర్ మాస్టర్ ఇలా.. ఒకరిని మించి ఒకరు.. అషూ డ్రెస్‌పై సెటైర్స్!
బుల్లితెరపై వినోద కార్యక్రమాలంటే డబుల్ మీనింగ్స్, లవ్ ట్రాకులు, కుళ్లు జోకులు ఉండాల్సిందే. అలాంటి వాటినే హైలెట్ చేస్తూ ప్రోమోలుగా కట్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం బుల్లితెరపై ఎంటర్టన్మైంట్ షోల్లో విపరీతమైన పోటీ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే కొత్తగా ప్రారంభమైన కామెడీ స్టార్, శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాంలు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

కామెడీ స్టార్స్ అలా...
బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అదిరింది టీంలో పని చేసిన వారితో కామెడీ స్టార్స్ అనే కొత్త షోను ప్రారంభించింది స్టార్ మా. బిగ్ బాస్ నాల్గో సీజన్ అనంతరం అవినాష్ ఈ షోకు శ్రీకారం చుట్టాడు. అవినాష్ నేతృత్వంలోనే ఈ ప్రోగ్రాం మొదలైంది. అదే సమయానికి బొమ్మ అదిరింది కూడా మూలన పడింది. అక్కడి ఆర్టిస్ట్‌లందరూ కూడా కామెడీ స్టార్స్‌కు జై కొట్టారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన అరియానా, అషూ, సుజాత వంటి వారంతా స్పెషల్ పర్ఫామెన్స్‌లు ఇస్తుంటారు. అవినాష్ చేసే స్కిట్లలో కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా అరియానా, సుజాతను అవినాష్ బాగానే వాడేస్తున్నాడు. అయితే ఈ షోలో కొత్త జంటకు నాంది పలికినట్టు అయింది.

అషూ, హరిల రచ్చ..
అషూ ఎక్స్ ప్రెస్ హరిల మధ్య ఏదో ఉన్నట్టుగా స్కిట్లను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కామెడీ స్టార్స్ షోలో హరి, అషూ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. ఆ మధ్య అషూ ఏకంగా ముద్దులు పెట్టడం, హగ్గులు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అంతే కాకుండా రొమాంటిక్ పర్ఫామెన్స్‌లతో రెచ్చిపోతున్నారు.

తాజాగా అలా..
అయితే తాజాగా వదిలిన ప్రోమోలోనూ ఈ ఇద్దరూ రెచ్చిపోయారు. అషూ చిన్న గౌను లాంటిది వేసుకుంది. అలా అషూ డ్యాన్స్ వేస్తుంటే.. హరి ఫ్లోర్ మూమెంట్ వేశాడు. ఇక దీనిపై శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్ వేసిన సెటైర్లు అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.
Recommended Video

ఒకరిని మించి ఒకరు..
ఇక అషూ అలా గౌను వేసుకుని డ్యాన్స్ వేయడం, హరి ఆమె ముందు ఫ్లోర్ డ్యాన్స్ వేయడంపై శేఖర్ మాస్టర్ కౌంటర్ వేశాడు. కొరియోగ్రఫర్‌ను అడిగి మరీ ఈ మూమెంట్ పెట్టించుకున్నావ్ కదా అని హరి పరువుతీసేశాడు. ఇక బాబా భాస్కర్ మధ్యలోకి వచ్చి.. కొరియోగ్రాఫర్‌ను అడగలేదు.. మేకప్ మెన్, స్టైలీష్ట్‌ను ఆ డ్రెస్ అడిగి ఉంటాడని సెటైర్ వేశాడు. ఇలా ఆ ఇద్దరిని ఈ ఇద్దరూ ఆడేసుకున్నారు.


Click it and Unblock the Notifications











