బిగ్‌బాస్ 2: బాబు గోగినేని ఔట్, రోల్ రైడా మీద బిగ్ బాంబ్

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Eliminated

బిగ్‌బాస్ 2లో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే అంశానికి తెరపడింది. ఆదివారం జరిగిన షోలో ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎవరు సురక్షిత జోన్లోకి వెళ్లారు? తక్కువ ఓట్లతో ఎవరు ఇంటి బయటకు వస్తున్నారు? అనేది నాని ప్రకటించారు. శనివారం జరిగిన షోలో గీతా మాధురి, శ్యామల సేఫ్ అని ప్రకటించిన నాని... ఆదివారం ఆసక్తికరంగా పలు టాస్కులు, ఆటలు నిర్వహించిన అనంతరం ఎలిమినేషన్ అంశాన్ని ప్రస్తావించారు. ముందుగా తనీష్, గణేష్, దీప్తి నల్లమోతే ఈ వారం ప్రేక్షకుల ఓట్ల ద్వారా సేఫ్ అయినట్లు ప్రకటించారు. చివరగా బాబు గోగినేని పేరు ప్రస్తావించి మీరు సుహానాను కలవాల్సిన టైమ్ వచ్చింది అంటూ అతడి ఎలిమినేషన్ ప్రకటించారు.

గ్రేట్ ప్రివిలేజ్

గ్రేట్ ప్రివిలేజ్

ఇంటి నుండి బయటకు వస్తూ బాబు గోగినేని మాట్లాడుతూ... ముందుగా మౌస్ మేట్స్‌కు థాంక్స్ చెప్పారు. నేను అన్ పాపులర్ ఐడియాస్, ఫ్రాంక్‌గా, అన్ డిప్లమాటిక్‌గా 63 రోజుల పాటు వింటూ సపోర్ట్ చేశారు. కొందరు వాటి గురించి ఆలోచిస్తన్నారు. ఇది గ్రేట్ ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను... అని బాబు తెలిపారు.

నా జీవితంలో యూనిక్ ఎక్స్ పీరియన్స్

నా జీవితంలో యూనిక్ ఎక్స్ పీరియన్స్

ఇలాంటి డిఫరెంట్ ఏజ్ గ్రూఫ్స్ వారితో ఆటలాడతాను, గొడవలు పడతాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ తప్ప నా జీవితంలో ఇలాంటి ఎప్పుడూ ఎదురు కాలేదు. ముందు ముందు ఇలాంటివి నా జీవితంలో ఎదురువతాయని కూడా అనుకోవడం లేదు. ఇదొక యూనిక్ ఆపర్చునిటీ.

సామ్రాట్ గురించి

సామ్రాట్ గురించి

ఇంటి నుండి బయటకు వచ్చిన బాబు గోగినేనికి ఇద్దరితో మాట్లాడే అవకాశం ఇవ్వడంతో... ఆయన ముందుగా సామ్రాట్ గురించి మాట్లాడారు. సామ్రాట్‌కు తాను అభిమానిని అని తెలిపారు. హౌస్‌కు లీడర్ షిప్ అనేది లేనపుడు ఒక మెటాలెవల్ లీడర్‌షిప్ ప్రొవైడ్ చేయగలిగాడని, నా లాంటి వారు పొరపాటున ఇంగ్లీష్ మాట్లాడితే నీళ్లలో దూకి శిక్ష అనుభవించాడు.... అని బాబు తెలిపారు.

దీప్తిపై ఎఫెక్షన్

దీప్తిపై ఎఫెక్షన్

దీప్తి సునైనపైన చాలా ఎఫెక్షన్ డెవలప్ చేసుకున్నాను. ఆమె పిల్లి వేషాలు, పిల్ల వేషాలు, ముద్దు మాటలు డిలైట్ టు వాచ్. ఇట్ వాజ్ గ్రేట్. నేను చిన్నప్పటి నుండి స్కూల్ టైమ్ నుండి ఆటల్లో అల్లరి పనులు చేశాను. కానీ నేను గెలవడానికి కాదు. తమాషాకి, మజాకి, నవ్వు కోవడానికే చేశాను.... అని బాబు గోగినేని గుర్తు చేసుకున్నారు.

రోల్ రైడా మీద బిగ్ బాంబ్

రోల్ రైడా మీద బిగ్ బాంబ్

వెళుతూ వెళుతూ రోల్ రైడా మీద బాబు గోగినేని బిగ్ బాంబ్ వేశారు. ఫస్ట్ టైమ్ బాత్రూం క్లీన్ చేసింది రోల్‌తో కలిసే.... అప్పటి పార్టనర్‌షిప్ ఇప్పటికీ మెయింటేన్ అవుతోంది అని బాబు వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X