Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బిగ్ బాస్ 2: రక్తం వచ్చేలా కోసుకుందామా? గీతా మాధురితో బాబు గోగినేని వాదన!
బిగ్ బాస్ ఇంట్లో 10వ రోజు చోటు చేసుకున్న పరిణామాలు ప్రేక్షకులను సైతం ఆలోచనలో పడేశాయి. బిగ్ బాస్ పెట్టే కొన్ని టాస్క్‌లు ఇంటి సభ్యులను గాయాల పాలు చేయడమే ఇందుకు కారణం. 'ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది' టాస్క్‌లో భాగంగా బురదలో నిర్వహించిన గేమ్స్ వల్ల తనీష్, కిరిటీ, రోల్ రైడాలకు చిన్నపాటి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో బాబు గోగినేని బిగ్ బాస్ మీద మండి పడ్డారు. ఒకరినొకరు కొట్టుకునేలా, గాయాలయ్యే అవకాశం ఉన్న టాస్క్‌లు ఇవ్వడం సరైన పద్దతి కాదంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ రారా కిందకు... అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
Recommended Video
ఇంటి సభ్యులను మందలించిన బాబు గోగినేని
బిగ్ బాస్ పెడుతున్న ఇలాంటి పిచ్చి పిచ్చి గేమ్స్‌కు ఎందుకు సహకరిస్తున్నారంటూ ఇంటి సభ్యులను బాబు గోగినేని మందలించారు. ఇకపై ఇలాంటి ఆటలు ఆడమని చెబితే.... మేము చేయబోము అని మొహం మీదే చెప్పాలని బాబు గోగినేని సూచించారు.
ఇక్కడే కత్తులతో కొట్టుకుందాం..
ఈ క్రమంలో సహనం కోల్పోయిన బాబు గోగినేని.... అక్కడ బురదలో కొట్టుకోవడం ఎందుకు ఇక్కడే కత్తులతో ఒకరినొకరు కొట్టుకుందా రక్తం వచ్చేలా అంటూ మండి పడ్డారు. ఈ టాస్క్‌లో రాజు పాత్ర పోషించిన నూతన్ నాయుడుపై సైతం బాబు గోగినేని ఫైర్ అయ్యారు. ఇలాంటివి అడ్డుకోవాల్సిన బాధ్యత నీ మీద లేదా? అంటూ చిటపటలాడారు.
గీతా మాధురితో బాబు వాదన
మధ్యలో గీతా మాధురి కల్పించుకుని ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని, డాక్టర్ కూడా వచ్చి చూశారు అని చెప్పడంతో..... ఆమె మీద కూడా విరుచుకుపడ్డారు బాబు. కత్తులతో ఆటలు, రక్తం కారడం అవసరమా? అంటూ మండి పడ్డారు.
కిచెన్‌లోకి పదండి ఇద్దరం కోసుకుందాం
ఒక్కోసారి కూరగాయలు కోస్తుంటే కూడా తెగిపోయి రక్తం కారుతుంది అని గీతా మాధురి అనడంతో..... అయితే పదండి ఇద్దరం కిచెన్‌లోకి వెళ్లి కోసుకుందాం అంటూ చాలా పెద్ద గొడవ చేశాడు బాబు. దీంతో బిగ్ బాస్ ఇంట్లో సీరియస్ వాతావరణం నెలకొంది.
నాకు గేమ్ ప్రాబ్లం కాదు, ఇలాంటివి వద్దు అంతే...
తనకు బిగ్ బాస్ గేమ్ ఆడటం సమస్య కాదని, అయితే ఇలా గాయాలయ్యే అవకాశం ఉన్న గేమ్స్ ఆడించవద్దని తాను కోరుకుంటున్నానని, ఒకరినొకరు కొట్టుకునే గేమ్స్ అస్సలు ఉండొద్దని బాబు గోగినేని అభిప్రాయ పడ్డారు.