బిగ్‌బాస్ హౌస్‌లో కుంపటి.. బెదిరిస్తున్నావా అంటూ బాబు ఫైర్, నిలదీసిన గీతా మాధురి!
Recommended Video

వారాలు గడిచే కొద్ది బిగ్ బాస్ హౌస్ లో సభ్యుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి. టైటిల్ గెలవాలనే కోరిక అందరిలో పెరుగుతోందని అందుకే సభ్యుల మధ్య మాటిమాటికి భేదాభిప్రాయాలు వస్తున్నాయని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి సభ్యులలో బాబు గోగినేని, కౌశల్, తనీష్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నేడు రాజగబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో విడుదల చేశారు.

ముందంజలో కౌశల్
బిగ్ బాస్ విన్నర్ గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటు అవుతుంది. కానీ ఆడియన్స్ లో మాత్రం కౌశల్ పై మంచి అభిప్రాయం నెలకొని ఉంది. వివాదాల్లో చిక్కుకుంటున్నా అతడి నిజాయతీగా ఉంటున్నాడని అంటున్నారు.

నిలదీసిన గీత మాధురి
హౌస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గీత మాధురి.. బాబు, కౌశల్, తనీష్ లని నిలదీయబోతున్నట్లు ప్రోమో ద్వారా అర్థం అవుతోంది. మీ ముగ్గురుకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ గీత మాధురి ప్రశ్నిస్తోంది.

బెదిరిస్తున్నావా
గీత మాధురి, బాబు, తనీష్, కౌశల్ మధ్య జరుగుతున్న వివాదం నేడు మరో లెవల్ కు వెళ్లేలా కనిపిస్తోంది. ఏం బెదిరిస్తున్నావా అంటూ బాబు గోగినేని ఫైర్ అవుతున్నారు. ఈ మొత్తం వివాదంలో కొత్తగా హౌస్ లోకి వచ్చిన పూజా రామచంద్రన్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు కనిపిస్తోంది.

పాజిటివ్
పాజిటివ్ మైండ్ తో చూస్తే అన్నీ పాజిటివ్ గానే కనిపిస్తాయని కౌశల్ అభిప్రాయపడ్డారు. ఎవరి అభిప్రాయాలు వారిదగ్గరే ఉంచుకోవాలని తనీష్ చెబుతున్నారు. శుక్రవారం జరిగే ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











