విశ్వక్ కు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ మద్దతు.. పాత వీడియోలతో పరువు తీసేశాడుగా!
హీరో విశ్వక్ సేన్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, న్యూస్ యాంకర్ అయిన దేవి నాగవల్లి మధ్య ఏర్పడిన వివాదం ఇంకా చల్లారలేదు. విశ్వక్ సేన్ కి మద్దతుగా కొందరు మాట్లాడుతుంటే దేవి నాగవల్లికి మద్దతుగా మరి కొందరు మాట్లాడుతున్నారు అయితే అధిక భాగం విశ్వక్ సేన్ తప్పేమీ లేదని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన బూతు మాట మాట్లాడడం మాత్రం తప్పని ఖండిస్తున్నారు. తాజాగా ఈ వివాదం మీద మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే సదరు ఛానల్ పరువు తీసే విధంగా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆరో తేదీన
తెలుగులో ఆసక్తికరమైన సినిమాలతో యూత్ ని టార్గెట్ చేస్తున్న విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడి మే ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

తగలబెట్టు కోవడానికి ప్రయత్నిస్తుంటే
అయితే గతంలో విడుదలైన పాగల్ సినిమా రిలీజ్ సమయంలో సరైన ప్రమోషన్ జరగలేదు అని భావించి విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రమోషన్స్ మరో లెవల్లో చేయాలని భావించాడు. అందులో భాగంగానే ఒక వ్యక్తి తన అభిమాని లాగా పెట్రోల్ పోసుకుని తగలబెట్టు కోవడానికి ప్రయత్నిస్తుంటే ఆపుతున్న విధంగా ఒక ప్రాంక్ చేశారు.

డిబేట్ కి వస్తానని చెప్పి
అయితే దేవి నాగవల్లి ఈ విషయం మీద తాను పని చేస్తున్న చానల్ లో ఒక డిబేట్ నిర్వహించారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూనే అనే పాగల్ సేన్ అనే టైటిల్ తో డిబేట్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వక్ సేన్ సదరు చానల్ ప్రతినిధులతో మాట్లాడి తాను లైవ్ డిబేట్ కి వస్తానని చెప్పి అక్కడికి వెళ్లారు.

గెటవుట్ అంటూ
కానీ అక్కడ అనుకోని పరిస్థితుల నేపథ్యంలో మీరు నన్ను ఇలా పాగల్ సేన్, డిప్రెస్డ్ పర్సన్ అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదని విశ్వక్ సేన్ దేవి నాగవల్లితో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆమె గెటవుట్ అంటూ దురుసుగా ప్రవర్తించింది, దీంతో విశ్వక్ సేన్ షాక్కు గురై వెంటనే ఒక బూతు మాట మాట్లాడాడు. ఇంకేముంది మహిళలను ఇలా అంటారా అంటూ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే విషయం మీద బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బాబు గోగినేని స్పందించారు.

డిలీట్ చేసిన వాడిదే రాజ్యం
''FLASH - FLASH - FLASH "మా అన్నొత్తేనే ఉంటా లేకపోతే నేను ఉండను!" అని నీళ్లతో నిండిన పెట్రోల్ క్యాన్ పట్టుకుని రోడ్డు పక్కన సూసైడ్ ప్రాంక్ స్కిట్ చేస్తున్న మిత్రులు. స్కిట్ ను టీవీ9 సరదాగా ప్రసారం చేసిన దృశ్యాలు. అప్పుడు ఎవరికీ ఇది సీరియస్ పబ్లిక్ న్యూసెన్స్ కాకపోవడం ఒక కొసమెరుపు. విశ్వక్ సేన్ చేసింది ఇదేనా? ఆఫ్ కోర్స్ ఇదీ స్టుపిడ్ నే అదీ స్టుపిడ్ నే. బట్ ఒకటి కరెక్టే, రెండోది కాదు అనడం నిజాయితీ నా? కానివ్వండి, వీడియోలు డిలీట్ చేసిన వాడిదే రాజ్యం అంటూ ఆయన విమర్శించారు.


Click it and Unblock the Notifications











