కౌశల్ ఆర్మీ రౌడీ మూక.. గీతను తిట్టారు, దీప్తి సునైనాను చచ్చిపో అన్నారు: బాబు గోగినేని

Recommended Video

Babu Gogineni Latest Sensational Comments on Koushal Army | Filmibeat Telugu

బిగ్ బాస్ 2 సీజన్ మొదలయ్యాక అందులోని కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతుగా పుట్టుకొచ్చిన కౌశల్ ఆర్మీ.. సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ, ట్రోల్స్ చేస్తూ రెచ్చిపోయేవారు. అప్పట్లో బిగ్ బాస్ హోస్ట్ నానికి కూడా కౌశల్ ఆర్మీ సెగ తగిలింది.

కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ, పేయిడ్ ఆర్మీ అంటూ బాబు గోగినేని ముందు నుంచీ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా కౌశల్ ఆర్మీలోని కొందరు వ్యక్తులు బయటకు వచ్చి కౌశల్ నిజస్వరూపం వెల్లడిస్తూ మీడియాకెక్కిన నేపథ్యంలో బాబు గోగినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్మీ గుట్టు రట్టయింది. దొంగలు పట్టుడ్డారు

ఆర్మీ గుట్టు రట్టయింది. దొంగలు పట్టుడ్డారు

తాజా వ్యవహారంపై బాబు గోగినేని స్పందిస్తూ... కౌశల్ ఆర్మీ గుట్టు రట్టయిందని, దొంగలు పట్టుడ్డారు అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు పెయిడ్ ఆర్మీ గురించి మాట్లాడుకున్నాం. అది పేయింగ్ ఆర్మీ అని కూడా తేలింది. వీరి పక్కన పెయిడ్ మీడియా ఉన్న సంగతి ఎవరూ మాట్లాడటం లేదని బాబు గోగినేని వ్యాఖ్యానించారు.

నేరపూరితంగా ప్రవర్తిస్తున్న ఒక రౌడీ మూకకు

నేరపూరితంగా ప్రవర్తిస్తున్న ఒక రౌడీ మూకకు

ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ నేరపూరితంగా ప్రవర్తిస్తున్న ఒక రౌడీ మూకకు అవకాశాలు కల్పిస్తూ వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడించారు. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాను. ఎట్టకేలకు కౌశల్ ఆర్మీ నిజస్వరూపం బయట పడిందన్నారు.

వీరేదో పవిత్ర గంగాజలంలో మునిగినట్లు

వీరేదో పవిత్ర గంగాజలంలో మునిగినట్లు

ఈ రోజు కౌశల్ ఆర్మీ వారిలో వారే కొట్లాడుకుని ఆయన్ను ఇప్పుడు తిట్టేసి... వీరేదో పవిత్ర గంగాజలంలో మునిగినట్లు ప్రవర్తిస్తున్నారు. గతంలో వీరు కూడా కౌశల్ ఆర్మీ పేరుతో ఎంతో మందిని దూషించిన వ్యక్తులే అని బాబు గోగినేని చెప్పుకొచ్చారు.

గీతను తిట్టారు, దీప్తిని చచ్చిపో అన్నారు

గీతను తిట్టారు, దీప్తిని చచ్చిపో అన్నారు

గీత మాధురి గారిని ఎంత దారుణంగా దూషించారు ఈ ఆర్మీ పేరుతో అనే విషయం మరిచిపోకూడదు. హీరో అయిన ఆమె భర్తగారు ఇప్పటి వరకు పోలీస్ కేసు పెట్టక పోవడం ఆశ్చర్యం వేస్తోంది. చిన్న పిల్ల దీప్తి సునైనాను నువ్వు చచ్చిపో అని పోస్టు పెట్టారు ఈ రౌడీలు. ఈ రాస్కెల్స్ అందరికీ పోలీస్ స్టేషన్ అంటే ఏమిటో చూపించే ప్రయత్నం ఎవరూ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది బాధితులే చేయాలి.. వారు చేయలేదు కాబట్టి నాకు ఆశ్చర్యంగా ఉందన్నారు.

రుజువులతో సహా నిరూపించాను

రుజువులతో సహా నిరూపించాను

బిగ్ బాస్ అనే గేమ్‌ను ఇష్టం వచ్చినట్లు ఆడుకుని గేమ్ ఇన్ ది గేమ్ చేశారని నేను అన్ని రుజువులతో మెల్ బోర్న్ లో నిరూపించాను. అవి కూడా కన్సిడర్ చేసి ఇప్పటికైనా ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి హేతు బద్దమైన ఆలోచన చేయాలనే విషయం మిరిచిపోకుండా ఉంటే ఇది ప్రతి ఒక్కరికీ గుడ్ లెసన్ అవుతుందని బాబు గోగినేని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X