twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏమిటీ వెకిలి వేషాలు? వారిపై చర్యలు తీసుకోరా? బిగ్ బాస్ 3పై బాబు గోగినేని

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Babu Gogineni Fires On Bigg Boss Telugu Management || Filmibeat Telugu

    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్ ఇటీవల ప్రారంభమైనప సంగతి తెలిసిందే. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. మొదటి వారం నటి హేమ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే వ్యూవర్స్‌తో పాటు బిగ్ బాస్ హౌస్ మెంబర్లకు కూడా సర్‌ప్రైజ్ ఇస్తూ ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

    కాగా... హేమ ఎలిమినేట్ అవ్వడానికి ముందే, తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈ విషయాలు బయటకు లీకైన సంగతి తెలిసిందే. ఇలా లీకులతో షో జరుగుతున్న విధానంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని స్పందించారు.

    ఏమిటీ వెకిలి వేశాలు?

    ఏమిటీ వెకిలి వేశాలు?

    ఎవరు హౌస్‌లో నుంచి బయటకు వెళ్లిపోతున్నారు? ఎవరు రాబోతున్నారు అనే పుకార్లు అందరికంటే ముందే కొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ స్ప్రెడ్ చేయడం ఏమిటండీ? ఏమిటీ వెకిలి వేశాలు. మీరు గేమ్ ఆడుతున్నపుడు డిస్ట్రాయిడ్ చేశారు... గేమ్ బయటకు వచ్చి కూడా అలాంటి పనులే చేస్తున్నారు. నేను దీన్ని ఖండిస్తున్నాను. ఇది సరైంది కాదు... అంటూ బాబు గోగినేని ఫైర్ అయ్యారు.

    బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి?

    బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించి?

    హేమ గారు వెళ్లిపోవచ్చు, తమన్నాగారు రావొచ్చు. కానీ ఆ విషయాలు మీరు చెప్పడం ఏమిటి? దాన్ని పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం ఏమిటి? అంటూ గోగినేని మండి పడ్డారు. బాబు గోగినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరి గురించి? అనేది హాట్ టాపిక్ అయింది.

    వాహ్! క్యా బాత్ హై... శ్రీముఖితో పిసికించాడుగా, బిగ్‌‌బాస్ భలే చేశాడంటూ కామెంట్స్!వాహ్! క్యా బాత్ హై... శ్రీముఖితో పిసికించాడుగా, బిగ్‌‌బాస్ భలే చేశాడంటూ కామెంట్స్!

    ఇందులో ఆర్గనైజర్స్ తప్పుకూడా ఉంది

    ఇందులో ఆర్గనైజర్స్ తప్పుకూడా ఉంది

    బిగ్ బాస్ ఆర్గనైజర్స్ తప్పు కూడా ఇందులో ఉంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో తెలుగు వారు నాలుగు వందల మందితో టీమ్ క్రియేట్ చేసి అక్కడే బిగ్ బాస్ హౌస్ కట్టి, పక్క గల్లీలో ఉన్న పాటలు కూడా ఇక్కడ వినిపించేట్లు చేస్తూ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అనేది డిస్ట్రాయ్ చేశారు. అందుకే బిగ్ బాస్ హౌస్ విషయాలన్నీ బయటకు లీక్ అవుతున్నాయి... అని బాబు గోగినేని అభిప్రాయపడ్డారు.

    వారిపై చర్యలు తీసుకోవారా?

    వారిపై చర్యలు తీసుకోవారా?

    బిగ్ బాస్ షోకు సంబంధించిన విషయాలను బయటకు లీక్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోక పోవడం ఏమిటి? ఈ గేమ్‌ను రైట్ స్పిరిట్‌తో ఆడటానికి వచ్చిన వారి ఇంటిగ్రిటీని కాపాడాల్సిన బాధ్యత గేమ్ ఆర్గనైజర్లకు ఉండాలి... అని బాబు గోగినేని సూచించారు.

    English summary
    Former Constant Babu Gogineni said that the Bigg Boss Telugu Season 3 reality show was unfair. The subject of the Hema elimination leaked earlier, as well as the Tamanna Wildcard entry. This is not the right method. He said action should be taken against those who leaked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X