ఛానల్ హెడ్ చెప్పాడు.. కౌశల్ ఆర్మీ అసలు గుట్టు ఇది.. ప్రకంపనలు సృష్టిస్తున్న బాబు గోగినేని!
Recommended Video

బిగ్ బాస్2 ఎంత రసవత్తరంగా సాగుతుందో అదేస్థాయిలో వివాదాలు కూడా మొదలవుతున్నాయి. కౌశల్ కు బయట కౌశల్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున మద్దత్తు లభిస్తోంది. దీనిపై బాబు గోగినేని తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. బిగ్ బాస్ జరుగుతున్న విధానంపై, కౌశలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ లో కౌశల్ హాట్ ఫెవరెట్ గా కొనసాగుతున్నాడు. కౌశల్ ఫైనల్ చేరడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కౌశల్ ఆర్మీ
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాబు గోగినేని కౌశల్ ఆర్మీపై మండిపడ్డారు. కౌశల్ ఆర్మీ ఏంటి.. ఆర్మీ అయితే పాకిస్థాన్, ఇండియా బోర్డర్ లో యుద్ధం చేయండి. కనీసం తుపాకీ, లాఠీ అయినా పట్టుకుని బోర్డర్ లో కాపలాగా నిలబడండి.

అల్లరి మూక
ఒక సింపుల్ టివి రియాలిటీ షో కోసం సోషల్ మీడియాలో ఇంత హంగామా అవసరమా.. ఈ ఆర్మీతో కచ్చితంగా డీల్ పెట్టుకుని హౌస్ లోకి వచ్చారు. కౌశల్ మోడలింగ్ లో రాణిస్తున్నాడు.. వ్యాపారాలు కూడా ఉన్నాయి. మీ మేనేజర్ చాలా బాగా పనిచేస్తున్నారు అని రిపోర్ట్ ఇవ్వడం నేను చూశా.

భార్య గురించి
కౌశల్ తన భార్య గురించి నాతో చెప్పాడు. రెండు మూడు వారాల్లో నా భార్య చాలా చేసేస్తోంది అని చెప్పాడు. అది కచ్చితంగా వ్యాపారం గురించి కాదు. ఎందుకు ఆమాట అన్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది.

శ్యామల కూడా
శ్యామల కూడా బయట డీల్ మాట్లాడుకుని వచ్చిందని బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెలో మార్పుని నాని కూడా స్పష్టంగా గమనించారు. ఆమెఎలిమినేట్ అయి బయట అన్ని విషయాలు సెట్ చేసుకుని వచ్చారు. పిన్నిగారేనా వచ్చింది అని నాని అడగగా కాదు వాళ్ళ అమ్మాయి అని శ్యామల బదులిచ్చింది.

ఒక ఛానల్ హెడ్
హౌస్ లోకి వెళ్లిన వారు చాలా మందితో డీల్ కుదుర్చుకున్నారని ఓ ఛానల్ హెడ్ తనతో చెప్పాడని బాబు గోగినేని అన్నారు. చాలామందికి వాళ్ళు ఆఫర్స్ ఇచ్చారట. ఇది సరైన పద్దతి కాదు. ఆతనియమాలని దెబ్బతీసే ప్రక్రియ అని బాబు అన్నారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ
తాను వైల్డ్ కార్డు ఎంట్రీకి కూడా వ్యతిరేకం అని బాబు గోగినేని అన్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన వారికి బయట అన్ని విషయాలు తెలుస్తాయి. అది సరైన గేమ్ ఎలా అవుతుంది. ఎలిమినేట్ అయి మళ్ళీ వచ్చిన వారు బయట విషయాలు వారికి నచ్చిన వారితోనే చర్చించడం నేను చూశా.

కౌశల్ అభిమానులు
కౌశల్ కి ఇంతమంది అభిమానులు ఉన్నారని నేను అసలు అనుకోను. నాకు నిజజీవితంలో తెలిసిన కౌశల్ ఏకైన అభిమాని నాని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్ లో మిగిలిన ఇంటి సభ్యులు తప్పు చేస్తే మాట్లాడడం,కౌశల్ చేస్తే పట్టించుకోకపోవడం సరైన విధానం కాదు అని బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











