చిల్లర, అకతాయి అంటూ గీతాపై బాబు నోటి దురుసు! కెప్టెన్‌గా పనికిరావు..

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Serious Conversation Between Geetha & Babu Gogineni

బిగ్‌బాస్‌లో బాబు గోగినేని వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతున్నది. 46వ ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన కెప్టెన్ టాస్క్‌లో దీప్తి నల్లమోతును దిమ్మెపై నుంచి బకెట్‌తో తోసారనే అంశంతో బాబు వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. ఆయన తీరుపై ఇంటి సభ్యుల్లో కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కెప్టెన్ టాస్క్ అనంతరం ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గీతా మాధురితో వాగ్వాదం

గీతా మాధురితో వాగ్వాదం

గీతామాధురి కెప్టెన్‌గా రెండోసారి ఎంపికైన తర్వాత బాబు గోగినేని ఆమెతో వాగ్వాదం చేపట్టారు. దీప్తి నల్లమోతు గానీ, సామ్రాట్ కెప్టెన్‌గా అయితే బాగుంటుందని అనుకొన్నాను అని బాబు గోగినేని అన్నారు. దానికి సమాధానం ఇస్తూ దీప్తితో మీరు వ్యవహరించిన తీరు ఆమెను కెప్టెన్‌గా చేయడం ఇష్టం లేదనే విధంగా ప్రొజెక్ట్ అయింది అని గీతా మాధురి అన్నారు. గీతా మాటకు సమాధానం ఇస్తూ ఐ డోంట్ కేర్ అని అన్నాడు.

దీప్తి నల్లమోతు వీక్ క్యాండెట్

దీప్తి నల్లమోతు వీక్ క్యాండెట్

కెప్టెన్‌గా దీప్తి నల్లమోతు చాలా వీక్ క్యాండెట్ అని అనుకొన్నాను. అందుకే ఆమెను సపోర్ట్ చేయలేదు అని పరోక్షంగా చెప్పారు. మీరు దీప్తికి అనుకూలంగా లేరనే విషయం అందరికీ అర్ధమైంది అని గీతా మాధురి వాదించింది.

మీరు దీప్తికి మద్దతిస్తే

మీరు దీప్తికి మద్దతిస్తే

దీప్తి నల్లమోతును కెప్టెన్ చేయాలనుకుంటే మీరు నీళ్ల బకెట్‌తో కొట్టేవారు కాదు. అది అబద్దామా నిజమా మీరే చెప్పండి. మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారోననే మీ ఉద్దేశం గురించి మేము మాట్లాడుకొంటున్నాం అని గీతా మాధురి అన్నారు. అయితే నా ఉద్దేశం గురించి మాట్లాడుకోవడానికి మీరెవరు. నేను మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని బాబు గోగినేని ఫైర్ అయ్యారు.

గీతా మీరు కెప్టెన్‌గా లీడర్

గీతా మీరు కెప్టెన్‌గా లీడర్

మీరు కెప్టెన్‌గా లీడర్ షిప్ చేయాలి. అలాంటిది మీరు కూర్చొని ఇంటి సభ్యులను గ్రూపులుగా విడగొట్టకు. కెప్టెన్ టాస్క్ అంశంపై నేను ప్రవర్తించిన తీరుపై మీరు చేసే విశ్లేషణను నిజాయితీగా చేయడం లేదు అని గోగినేని అన్నారు.

నీ సర్టిఫికెట్ అవసరం లేదన్న గీతా

నీ సర్టిఫికెట్ అవసరం లేదన్న గీతా

గోగినేని మాటలపై తీవ్రంగా స్పందించిన గీతా మాధురి ఆయన నా నిజాయితీపై సర్టిఫికెట్ ఇవ్వడం అవసరం లేదు. ఇంటి లీడర్‌ పాత్రలో మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎదుటి వాళ్ల ఉద్దేశాలపై అకతాయి మాటలు మాట్లాడకు. అకతాయి మాటలు మాట్లాడటానికి వీల్లేదు. లీడర్‌గా వ్యవహరించడం నేర్చుకో అని బాబు గోగినేని హెచ్చరించారు.

మీ చిల్లర మాటలు, అకతాయంటూ..

మీ చిల్లర మాటలు, అకతాయంటూ..

గీతా మాధురిని బాబు గోగినేని అంతటితో వదల్లేదు. మీ చిల్లర మాటలు, అకతాయి మాటలను ఒప్పుకోలేదు. మీరు ఎవరూ నాకు ఏదైనా చెప్పడానికి. మీ డ్యూటీ మీరు బాగా చేయండి. నలుగురైదుగురిని కూడగట్టుకొని గ్రూప్‌ రాజకీయాలు చేస్తున్నారు అని బాబు గోగినేని నోరు పారేసుకొన్నారు.

కౌశల్‌పై తనీష్, సామ్రాట్

కౌశల్‌పై తనీష్, సామ్రాట్

గీతా మాధురి జరుగుతున్న గొడవలో మధ్యలో జోక్యం కలిగించుకున్న కౌశల్‌పై బాబు, తనీష్, సామ్రాట్ మండిపడ్డారు. ఆయన నాకు తెలిపితే మీకు అభ్యంతరం అని సమ్రాట్, తనీష్‌ను గీతామాధురి నిలదీయడంతో అంతటితో వివాదానికి తెరపడింది.

మాట మార్చిన బాబు గోగినేని

మాట మార్చిన బాబు గోగినేని

దీప్తిని దిమ్మెపై నుంచి తోసిన తర్వాత ఆమెను కలిసి మీరు కెప్టెన్‌గా ఎంపిక కావాలన్నదే నా ఉద్దేశం అని చెప్పారు. నాకు తొండి ఆడటం ఇష్టం లేదని ఆయన చెప్పుకొంటూ వచ్చారు. ఒకవేళ దీప్తికి మద్దతు తెలిపితే ఆమెపై ఎందుకు నీళ్లు పోసి, డిస్ట్రబ్ చేయడానికి ప్రయత్నిస్తారనే ప్రశ్నను కొందరు సంధిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X