బాబు గోగినేనికి ఎంత అహంకారం.. భలే సొంత డబ్బా.. కౌశల్‌ డేంజర్‌.. బయటకు పంపిస్తా

By Rajababu

బిగ్‌బాస్‌లో రోజులు గడుస్తున్న కొద్ది సెలబ్రిటీల మధ్య వాగ్వాదాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కౌశల్‌కు ఇంటి సభ్యులకు మధ్య పోటీ భారీగానే పెరిగింది. కౌశల్‌ను బలమైన అభ్యర్థి అని భావిస్తున్న వారందరూ అతడిని టార్గెట్ చేస్తున్నారు. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా బాబు గోగినేని, కౌశల్ మధ్య భారీగానే మాటల యుద్ధం జరిగింది. బాబు గోగినేని ఏమన్నారంటే..

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 46 Highlights
రాజమౌళిని ఎందుకు తిట్టానంటే..

రాజమౌళిని ఎందుకు తిట్టానంటే..

రాజమౌళి, కీరవాణిని నేను తిట్టానని చెబితే వాళ్ల ఫ్యాన్స్ అందరూ కౌశల్‌కు సపోర్ట్‌గా నిలుస్తారని కౌశల్ ఉద్ధేశం. వారిని తిట్టడం వల్ల నాకు ఫేమ్ వస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే నేను ఇప్పటికే చాలా మందికి తెలుసు. నాకు నేను చెప్పుకొంటే బాగుండదు. నేను ఎవరికి తెలియని వ్యక్తి కాను. రాజమౌళిని ఎటాక్ చేస్తే వాళ్లే నన్ను ఎటాక్ చేస్తారు అని బాబు గోగినేని అన్నారు.

రాజమౌళిని ఎటాక్ చేస్తే

రాజమౌళిని ఎటాక్ చేస్తే

ఒకవేళ రాజమౌళిని నేను ఎటాక్ చేస్తే ఆయన సమాధానం చెప్పుకొంటారు. ఆయనకు కౌశల్ కావాలా? రాజమౌళికి కిరాయి స్పోక్స్ పర్సన్ అవసరం లేదు. రాజమౌళికి సినిమాలు తీయడం వచ్చు. నాకు రాదు. నాకు ఆలోచన వచ్చు. రాజమౌళికి రాదు. నేను ఆయనకు నేర్పిస్తా. ఆయన నుంచి నేను నేర్చుకొంటా అని బాబు గోగినేని స్పీచ్ ఇచ్చాడు.

కౌశల్ ఛాన్సు తీసుకొంటున్నాడు..

కౌశల్ ఛాన్సు తీసుకొంటున్నాడు..

రాజమౌళిని అడ్డం పెట్టుకొని కౌశల్ ఏదో ఛాన్సు తీసుకోవాలని చూస్తున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఆయనను పంపించడమే నా టార్గెట్. నా కంటే ముందు పోతాడా? లేక వెనక పోతాడా అనే అప్రస్తుతం. కౌశల్ ఈ హౌస్‌లో డేంజర్. ఆయన ఉండొదు.

నేను ఇంటర్నేషనల్ ఫిగర్‌ను

నేను ఇంటర్నేషనల్ ఫిగర్‌ను

కౌశల్ స్థాయి వేరు.. నా స్థాయి వేరు అని బాబు గోగినేని అనడంపై గీతా మాధురి అభ్యంతరం చెప్పారు. అయితే నా స్థాయి చాలా పెద్దది. ఆయనకు నేను సంబంధం లేదు. నాది ఇంటర్నేషనల్ ఫిగర్. నేను తెలుగు మాట్లాడుతున్న కారణంగా నీకు దొరుకుతున్నాను అనుకోవద్దు. నేను మీతో ఇంట్లో ఉన్నాన్న కారణంగా నా ఆలోచనలు అర్ధం అవుతున్నాయని అనుకోవద్దు అని అన్నారు.

కౌశల్‌ది నా లెవెల్ కాదు. .

కౌశల్‌ది నా లెవెల్ కాదు. .

నా లెవెల్ వేరు. నా లెవెల్‌లో మాట్లాడేవాళ్లు నా స్థాయి ఉండాలని నేను అనుకోవడం తప్పుకాదు. నా యాక్టింగ్ రాదు. కానీ విమర్శించడం వచ్చు. మీకు పాటలు పాడటం వచ్చు. నాకు రాదు. నాకు అసలు వినడమే రాదు. కానీ నాకు నచ్చిందా లేదా అనేది చెప్పడం వచ్చు అని బాబు గోగినేని అన్నారు. ఇలా బాబు మాట్లాడం సొంత డబ్బా కొట్టుకొంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బాబు గోగినేనిపై కౌశల్ మండిపాటు

బాబు గోగినేనిపై కౌశల్ మండిపాటు

రాజమౌళిని విమర్శించడం వల్ల బాబు గోగినేనిని ఈ వారం నామినేట్ చేస్తున్నాను. మీరు నాస్తికుడు కావొచ్చు దేవుడ్ని నమ్మకపోవచ్చు. మా సినిమా పరిశ్రమకు దేవుడు రాజమౌళి, మా మ్యూజిక్ దేవుడు కీరవాణి అని భావిస్తాం. బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత వారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు. అది తప్పు అని బాబుపై కౌశల్ సీరియస్ అయ్యారు.

 రాజమౌళిని విమర్శించే స్థాయా?

రాజమౌళిని విమర్శించే స్థాయా?

రాజమౌళి నాస్తికుడు అయి ఉండి మంత్రాలయానికి వెళ్లాడని బాబు గోగినేని అన్నారు. ఆయన వెళ్తారు. ఆయన ఇష్టం అది. అతనిని విమర్శించే హక్కులేదు. అలాంటి వాటిని సహించం అని కౌశల్ అన్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో అలాంటి విమర్శలను ఒప్పుకోం. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు రాజమౌళిని అంటే యాక్టర్‌గా ఊరుకోం. మీరు అది చేసినందుకు మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని కౌశల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X