కౌశల్ X తనీష్: నానిపై బాబు గోగినేని ఫైర్.. బిగ్‌బాస్‌లో కొత్త వివాదం

బిగ్‌బాస్2 రియాలిటీ షో ముగిసి చాలా నెలలు అవుతున్నా ఆ ఇంటిలో జరిగిన విషయాలు ఇంకా సెలబ్రిటీలను వెంటాడుతూనే ఉన్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో కంటే ప్రస్తుతం బయట సెలబ్రిటీల వ్యవహారం రసవత్తరంగా మారింది. కౌశల్, తనీష్ మధ్య చోటు చేసుకొన్న వివాదం ఏపీ సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకొనే స్థాయి వరకు వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్2 హోస్ట్ నానిపై బాబు గోగినేని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. బాబు గోగినేని ఏమన్నారంటే..

కౌశల్ ఆర్మీ తీరుతో సెలబ్రిటీలు

కౌశల్ ఆర్మీ తీరుతో సెలబ్రిటీలు

బిగ్‌బాస్2 షోలో కంటెస్టెంట్లు బాబు గోగినేని, తనీష్‌తో కౌశల్ వాగ్వాదం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. కౌశల్ ఒంటరివాడయ్యాడనే ఫీలింగ్ ఏర్పడటంతో బిగ్‌బాస్ ప్రేక్షకులు అండగా నిలిచారు. ఇంట్లో కౌశల్‌కు బయట నుంచి కౌశల్ ఆర్మీ భారీగా మద్దతు తెలిపింది. ఆ క్రమంలో ఇంట్లో సభ్యుల కూడా కొంత అభద్రతాభావానికి గురయ్యారు.

కౌశల్ ఆర్మీ ప్రభావితంపై బాబు గోగినేని

కౌశల్ ఆర్మీ ప్రభావితంపై బాబు గోగినేని

బిగ్‌బాస్ షో కొనసాగుతుండగానే ఓటింగ్‌ను కౌశల్ ఆర్మీ ప్రభావితం చేస్తున్నదని వాదన వినిపించింది. అంతేకాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను కూడా కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసిందనే మాటలు కూడా వచ్చాయి. అయితే కౌశల్ ఆటతీరు, యాటిట్యూడ్‌తో ఆ మాటలు, వాదన గాలికి కొట్టుకుపోయాయి.

నాని స్పందించాలి

నాని స్పందించాలి

బిగ్‌బాస్ షోలో కౌశల్ గురించి, తన ఆర్మీ గురించి బాబు గోగినేని పలు అభ్యంతరాలు లేవనెత్తగా.. గేమ్‌ను గేమ్‌లా ఆడాలి అంటూ బాబు గోగినేనికి నాని క్లాస్ పీకిన విషయం తెలిసిందే. తాజాగా కౌశల్‌పై కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు రివర్స్ అయిన సందర్భంగా ఓటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్‌ను ప్రభావితం చేశారనే అంశంపై నాని స్పందించాలని బాబు గోగినేని డిమాండ్ చేశారు.

బాబు గోగినేని డిమాండ్‌కు నాని స్పందిస్తారా?

బాబు గోగినేని డిమాండ్‌కు నాని స్పందిస్తారా?

బిగ్‌బాస్ ఓటింగ్‌లో ప్రజాభిప్రాయం స్పష్టం కాలేదు. కాబట్టి నాని ఈ ప్రక్రియపై స్పందించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే బాబు గోగినేని డిమాండ్‌పై నాని స్పందిస్తారా? ఇప్పుడు స్పందిస్తే మరో వివాదానికి దారి తీస్తుందా? అనే కీలక అంశంగా మారింది. బాబు గోగినేనికి నాని ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X