వయసు మీరిన కమెడియన్‌తో శ్రీముఖి పెళ్లి.. అందరి ముందే ఇష్టం అంటూ!

బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది యాంకర్లుగా ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే చేతి నిండా షోలు చేస్తూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో అందరి కంటే పై స్థాయిలోనే ఉంది శ్రీముఖి. అందంతో పాటు హోస్టింగ్‌తో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. వరుసగా ఆఫర్లను అందుకుంటూనే ఉంటోంది. ఇలా ఇప్పుడు ఎన్నో రకాల కార్యక్రమాలను నడిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీముఖి పెళ్లిపై తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను వివాహం చేసుకుంటానని ఫేమస్ కమెడియన్ షాకిచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే....

ఫుల్ షోలతో యమా బిజీగా
ఈ మధ్య కాలంలో యాంకర్ శ్రీముఖి చేతి నిండా ఆఫర్లతో హవాను చూపిస్తోంది. ఇటీవలి 'జాతి రత్నాలు', 'మిస్టర్ అండ్ మిస్సెస్', 'సారంగ దరియా', 'బీబీ జోడీ' వంటి షోలను సక్సెస్‌ఫుల్‌గా నడిపింది. ఇక, ఇప్పుడు 'నీతోనే డ్యాన్స్ 2'తో పాటు 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోంది. అలాగే, సినిమాలు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లలోనూ భాగం అవుతోంది.

Babu Mohan Funny Comments on Anchor Sreemukhi In Aadivaaram With Star Maa Parivaaram Show

ఆదివారం పరివారంతోనే
శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి సండే ప్రసారం అయ్యే ఈ కార్యక్రమంలో బుల్లితెర ప్రముఖులు గెస్టులుగా వచ్చి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో శ్రీముఖితో పాటు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి కూడా సందడి చేస్తోన్నాడు. వీళ్లంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు.

ఈ వారం స్పెషల్ వాళ్లే
ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలోకి బుల్లితెరపై సందడి చేస్తోన్న సెలెబ్రిటీలతో పాటు స్పెషల్ గెస్టులు వచ్చి రెండు టీమ్‌లుగా ఏర్పడి గేమ్స్ ఆడుతుంటారు. ఇందులో భాగంగానే ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు బుల్లితెర మెగాస్టార్లతో పాటు వెండితెర సూపర్ స్టార్లు వచ్చారు. వాళ్ల రాకతో షో సందడిగా సాగబోతుంది.

Babu Mohan Funny Comments on Anchor Sreemukhi In Aadivaaram With Star Maa Parivaaram Show

నా ఫేవరెట్ నువ్వే అని
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా సినిమా సూపర్ స్టార్ తరపున సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, జయలలిత, శ్రీలక్ష్మి, బాబు మోహన్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లకు యాంకర్ శ్రీముఖి తనదైన రీతిలో వెల్‌కం చెప్పింది. ఆ సమయంలో బాబు మోహన్ 'నాకు ఎందరో ఫ్యాన్స్. కానీ, నేను శ్రీముఖి ఫ్యాన్‌ను' అంటూ చెప్పి ఆమెను సర్‌ప్రైజ్ చేశారు.

నా పెళ్లి కావట్లేదంటూ
ఎంతో సందడిగా సాగబోతున్న వచ్చే వారం 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా సీనియర్ నటీనటులు అందరూ కలిసి 'ఆహా నా పెళ్లంటా.. ఒహోనా పెళ్లంట..' అనే పాటను డ్యాన్స్ మూమెంట్లు చేస్తూ మరీ ఆలపించారు. ఆ సమయంలో వాళ్ల ముందు ఫన్నీగా ఏడుస్తూ కూర్చున్న శ్రీముఖి 'నాకెందుకు అవడం లేదు పెళ్లి' అంటూ డైలాగ్ కొట్టింది.

Babu Mohan Funny Comments on Anchor Sreemukhi In Aadivaaram With Star Maa Parivaaram Show

నేను చేసుకుంటానని
యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి డైలాగ్ విసరగానే.. అక్కడే ఉన్న బాబు మోహన్ ఏమాత్రం తడుముకోకుండా 'నిన్ను పెళ్లి చేసుకోడానికి నేను రెడీగా ఉన్నా కదా' అంటూ పంచ్ వేశారు. అంతే.. ఇది చూసిన వాళ్లంతా బాబు మోహన్‌కు శ్రీముఖికి పెళ్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X