నా వల్ల సౌందర్యకు భారీ నష్టం.. ఆ ఘటనపై బాబు మోహన్ ఆవేదన
జబర్దస్త్ వర్ష ప్రస్తుతం కిస్సిక్ టాక్ షోతో ఆకట్టుకుంటోంది. సెలబ్రెటీలను తన షోకు ఆహ్వానిస్తూ ఆసక్తికరమైన విషయాలను తెలుగు ప్రేక్షకులకు తెలియజేస్తోంది. ఇక తాజాగా వర్ష Kissik Talks షోకు టాలీవుడ్ సీనియర్ నటుడు బాబు మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌందర్యతో కలిసి చేసిన సాంగ్ గురించి మాట్లాడారు. ఆ సాంగ్ వెనకాల జరిగిన కథ ఏంటీ అనే విషయాలను వివరంగా చెప్పుకొచ్చారు.
బాబు మోహన్ - సౌందర్య సాంగ్..
టాలీవుడ్ సీనియర్ నటుడు బాబు మోహన్ ఎన్నో చిత్రాల్లో నటించి కామెడీని పంచారు. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బాబు మోహన్ సహాయ నటుడిగా, కామెడీ పాత్రల్లోనే ఎక్కువగా మెరిశారు. అలాంటిది బాబు మోహన్ తో కలిసి 'మయాలోడు' అనే చిత్రంలో ప్రముఖ నటి, దివంగత సౌందర్య నటించింది. ఆ చిత్రంలోని 'చినుకు చినుకు అందెలతో' అనే ఎవర్ గ్రీన్ సాంగ్ లో బాబు మోహన్ తో కలిసి సౌందర్య డ్యాన్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ పాటను ఇప్పటికీ సంగీత ప్రియులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.

'చినుకు చినుకు అందెలతో' సాంగ్ గురించి..
బాబు మోహన్ తాజాగా జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ 'చినుకు చినుకు అందెలతో' సాంగ్ ను గుర్తు చేసుకున్నారు. 'మాయలోడు' సినిమా వచ్చి 34 ఏళ్లు అవుతుందని, ఇప్పటికీ ఆ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా ఆ చిత్రంలో సౌందర్య తనతో కలిసి డ్యాన్స్ చేయడం అప్పట్లో చర్చగా మారిందన్నారు. సౌందర్యను చాలా మంది హెచ్చరించారని, బాబు మోహన్ తో డ్యాన్స్ తో నీ కెరీయర్ ను నష్టం కలుగుతుందని హెచ్చరించారని చెప్పుకొచ్చారు. కానీ సౌందర్య మాత్రం ఎవ్వరి మాటలు పట్టుంచుకోకుండా నేను చేస్తానని చెప్పడం ఆమె గొప్పతనాన్ని వ్యక్తం చేసిందన్నారు. అలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య కావడం విశేషమన్నారు.
బాబు మోహన్ నట జీవితం..
బాబు మోహన్ 1986 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. 'ఈ ప్రశ్నకు బదులేదీ' ఆయన మొదటి చిత్రం. ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ వంటి హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అలరించారు. ముఖ్యంగా కోట శ్రీనివాస్ - బాబు మోహన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకానిక్ గానే ఉన్నాయి. ఇప్పటి వరకు బాబు మోహన్ 500కు పైగా సినిమాలు చేశారు.
బాబు మోహన్ రాజకీయ జీవితం..
బాబు మోహన్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1998లో అంథోల్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో టీఆర్ఎస్ లో చేరి అంథోల్ నుంచి పోటీ చేసి శాసన సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2018 వరకు సేవలందించారు. ఆ తర్వాత బీజేపీ, ప్రజా శాంతి పార్టీల్లో చేరి తర్వాత మెంబర్ షిప్ ను వివరమించుకున్నారు. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications











