నువ్ నన్ను ఏం చేయలేవురా.. యాంకర్ రవి పరువు తీసిన అనుష్క.. పగలబడి నవ్విన ప్రదీప్!
ప్రతీ పండగకు ఓ స్పెషల్ ఈవెంట్ చేయడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ సారి కేవలం జబర్దస్త్ టీమ్ మాత్రమే కనిపించేది. ఈ సారి అదిరింది టీమ్ కూడా ఉగాదికి కనువిందు చేసేందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే జబర్దస్త్ టీమ్ చేయబోతోన్న పండగ సర్ పండగ అంతే ఈవెంట్ ప్రోమోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా అదిరింది టీమ్ చేసిన ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయింది.

అతిథిగా తరుణ్ మాస్టర్..
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రఫర్ తరుణ్ భాస్కర్ ఢీ షో న్యాయనిర్ణేతగా ఫుల్ ఫేమస్ అయ్యారు. బాబు గారి ఇంట్లో బుట్టభోజనం అనే స్పెషల్ ఈవెంట్‌కు అతిథిగా విచ్చేశారు. దళపతి సినిమాలోని సింగారాల పైరుల్లోన అనే పాటకు నాగబాబు, తరుణ్ భాస్కర్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు.

నిహారిక డైనమిక్ ఎంట్రీ..
బుల్లితెరపై నిహారిక ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె వేసే పంచ్‌లు స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రోమోలోనూ నిహారిక ఎప్పటిలానే పంచ్‌ల సంచిని తీసుకొచ్చినట్టు ఫటాఫట్ వేసేసింది. కాకపోతే కంటెస్టెంట్లకు మాత్రం బెత్తం దెబ్బలు ఎక్స్‌ట్రాగా పడ్డాయి.

అనుష్క గ్రాండ్ ఎంట్రీ..
సౌత్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ఎంట్రీతో ఆ ఈవెంట్‌కు ఓ కళ వచ్చింది. అనుష్క రావడం ఒకెత్తు అయితే బిత్తిరి సత్తి ఎంట్రీ ఇవ్వడం, అనుష్కపై పేరడీ పాట పాడటం, స్వీటీ చేసిన ఉగాది పచ్చడి ప్రదీప్ తినడం ఇలా ప్రోమో అంతా సందడిగా సాగింది.
Recommended Video

నువ్ నన్ను ఏం చేయలేవురా..
అరుంధతి సినిమాలో పశుపతిలా యాంకర్ రవి ఎంతో ఇంటెన్సిటీ చేయడం, దాన్ని అనుష్క సిల్లీగా తీసుకుని నువ్ నన్ను ఏం చేయలేవురా అంటూ కూరలో కరివేపాకులా తీసిపారేసింది. దీంతో యాంకర్ రవి పరువు పోయినట్టైంది. ఆ మాట అనడంతో పక్కనున్న ప్రదీప్ పగలబడి నవ్వేశాడు. మొత్తానికి బాబు గారి ఇంట్లో బుట్టభోజనం అదిరిపోయేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











