Bigg Boss 7 ప్లాన్ ఛేంజ్.. హౌజ్‌లోకి అన్‌ఎక్స్‌పెక్టెడ్ కపుల్, బేబీ బ్యూటీ.. ఇక టీఆర్పీ బద్దలే!
తెలుగులో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ముందు ఉంటుంది. త్వరలోనే తెలుగులో సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇక ఈ షోలో నాగార్జునే మళ్లీ హోస్ట్ చేయనున్నారు. ఇక ఈ షోకు సంబంధించి రోజుకో వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతన్న సంగతి తెలిసిదే. తాజాగా ఈ ఏడో సీజన్‌లో ఊహించని జంటతో పాటు.. బేబీ హీరోయిన్ కూడా పాల్గొనబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
ఏడాదికో సీజన్: ఇక తెలుగులో మొదటి సీజన్ జూనియర్ ఎన్టీఆర్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో తెలుగులోనూ.. నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఓ సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తూ షోను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే 6 రెగ్యులర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ఇక 7వ సీజన్ కు కూడా రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

పకడ్బందీగా ప్లాన్: ఇక గత ఆరవ సీజన్ కు ప్రేక్షకుల్లో నెగటివ్ వచ్చింది. అయితే ఆరో సీజన్ ఎలిమినేషన్స్, అలాగే కంటెస్టెంట్స్‌కు అన్యాయం జరిగిందన్న విమర్శలు తెగ వచ్చాయి. దీంతో ఆరో సీజన్‌పై కాస్త నెగిటివిటీ వచ్చింది. దీనితో 7 వ సీజన్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కొత్త సీజన్‌లో గత సీజన్లలో పాల్గొన్న వారిని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని తెలుస్తోంది.

పాల్గొనేవారు వీళ్లే: ఇక ఈ సీజన్ లో సురేఖా వాణి, ఆమె కూతురు, టీవీ 9 యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వర్షిణి, దీపికా పిళ్లై, సీనియర్ ఉదయ్ భాను రానున్నారని సమాచారం అందింది. వీరితో పాటు క్రికెటర్ వేణు గోపాల్ రావు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ చరిత్రలోనే ఈ షోలోకి అడుగుపెట్టిన మొట్టమెదటి క్రికెటర్ ఆయనే అవుతారు. ఇక వీరితో పాటు ఊహించని జంట కూడా ఈ షోలోకి అడుగుపెట్టనున్నారట. వారితో పాటు బేబీ హీరోయిన్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

అప్పుడే ఎంపిక: వైష్ణవి చైతన్య.. బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాతో యూట్యూబ్ సెలబ్రెటీగా ఉన్న వైష్ణవి.. ఒక్కసారిగా క్రేజ్ ను సాధించుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె ఛాలెంజింగ్ రోల్ చేశారని కొనియాడుతున్నారు. ఆమె సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ తెలుగు పిల్ల బిగ్ బాస్ 7 కి ఎంపికయ్యారట. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు షోలో వైష్ణవి చైతన్య కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బేబీ హీరోయిన్: అయితే గతంలోనే అగ్రిమెంట్ పై సైన్ చేశారట. అయితే బేబీ మూవీతో ఆమె స్టార్ అయ్యారు. ఈ పరిణామం బిగ్ బాస్ 7 కి బాగా కలిసి వస్తుందంటున్నారు. మరి ఇదే నిజమైతే ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతారు. ఇక ఈమెతో పాటు... ఓ జంట కూడా రాబోతుందని అంటున్నారు. వాళ్లు ఎవరో కాదు... ఆట షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సందీప్, జ్యోతి. వీళ్లు డాన్సర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే.

ఊహించని జంట: యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓ డ్యాన్స్ స్టూడియోని కూడా రన్ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికీ తమ డాన్స్ ని పంచుతున్నారు. కాగ సోషల్ మీడియాలో ఇప్పటికే సందీప్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో మనకి తెలిసిందే . జ్యోతి కూడా బాగా డాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది . అయితే ఇలాంటి జంట ఇప్పటికే రెండుసార్లు బిగ్ బాస్ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి . అయితే ఈసారి మాత్రం ఈ జంట హౌజ్లోకి వెళ్లడం పక్క అంటున్నారు. చూడాలి ఇక ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











