Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌కు షాకిచ్చిన బేబి.. షో చరిత్రలోనే తొలి కంటెస్టెంట్‌గా రికార్డు

తెలుగు బుల్లితెరపై దేనికీ రాని విధంగా రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఈ కార్యక్రమం.. ప్రతి ఏటా రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.

ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే మరో సీజన్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. దీంతో కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సెలెబ్రిటీ నిర్వహకులకు షాకిచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

Baby Heroine Vaishnavi Chaitanya Rejects Bigg Boss 7 Telugu Offer

ఏడవ సీజన్‌ అప్పటి నుంచే: బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందుకే ఇప్పటికే ఈ షో మన దగ్గరు ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సీజన్‌ను ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. దీంతో ఈ సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.

Baby Heroine Vaishnavi Chaitanya Rejects Bigg Boss 7 Telugu Offer

ప్రోమోలతో భారీ అంచనాలు: తెలుగులో బిగ్ బాస్ షోకు ప్రతిసారీ అదిరిపోయే స్పందన దక్కుతూ ఉంటుంది. అలాంటిది ఎన్నో రోజులుగా వేచి చూస్తోన్న ఏడో సీజన్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఈ షోను అభిమానించే వాళ్లంతా కొత్త సీజన్‌పై ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా దీని నుంచి ప్రోమోలను వదులుతున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలన్నీ భారీగా పెరుగుతున్నాయి.

కంటెస్టెంట్ల మీదనే ఫోకస్‌గా: మరికొద్ది రోజుల్లోనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ కోసం నిర్వహకులు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్కును మొదలు పెట్టేశారు. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక గురించి కాస్త ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఇలా చాలా మందిని నిర్వహకులు ఫైనల్ చేసినట్లు తెలిసింది. వాళ్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.

Baby Heroine Vaishnavi Chaitanya Rejects Bigg Boss 7 Telugu Offer

బేబి కూడా ఎంట్రీ ఇస్తుంది: బిగ్ బాస్ ఆరో సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నిర్వహకులు ఏడో దానిని ఎలాగైనా విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం పేరున్న సెలెబ్రిటీలను తీసుకు రావాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే 'బేబి' హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఈ సీజన్ కోసం ఎంపిక చేసుకున్నారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

Baby Heroine Vaishnavi Chaitanya Rejects Bigg Boss 7 Telugu Offer

బిగ్ బాస్‌కు షాకిచ్చిన బేబి: బిగ్ బాస్ ఏడో సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లన్నీ చకచకా జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా కంటెస్టెంట్ల లిస్టును కూడా దాదాపుగా ఫైనల్ చేసేశారు. ఈ నేపథ్యంలోనే ఏడో సీజన్‌లో పాల్గొనాల్సిన 'బేబి' హీరోయిన్ వైష్ణవి చైతన్య దీని నుంచి తప్పుకున్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. ఇది బుల్లితెరపై సెన్సేషన్ అవుతోంది.

Baby Heroine Vaishnavi Chaitanya Rejects Bigg Boss 7 Telugu Offer

అందుకే తప్పుకున్న బేబి: ఏడో సీజన్ కోసం బిగ్ బాస్ నిర్వహకులు వైష్ణవి చైతన్యతో ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారట. అంతేకాదు, ఈ సీజన్ కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే, 'బేబి' హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు బాగా వచ్చి డేట్స్ అడ్జస్ట్ చేయలేకనే ఈ సీజన్‌ నుంచి తప్పుకుందని తెలిసింది. షో చరిత్రలోనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్న కంటెస్టెంట్ ఈమెనని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X