Bigg Boss Telugu 8: షోలోకి బోల్డు బ్యూటీ ఎంట్రీ.. బూతులతోనే ఫేమస్.. ఇంతకీ ఎవరీ కిర్రాక్ లేడీ?

తెలుగు టెలివిజన్ రంగంలో దర్శక నిర్మాతలు, షో నిర్వహకులు పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ సెన్సేషన్ అయిందే బిగ్ బాస్. కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచి, వాళ్లతో టాస్కులు ఆడించి, ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడమే ఈ షో నేపథ్యం. దీంతో దీనికి భారీ స్థాయిలో స్పందన కూడా లభించింది. దీంతో ఇది రికార్డు స్థాయిలో రేటింగ్ రాబట్టి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది. ఈ ఊపులోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా మొదలైంది. ఇందులోకి తాజాగా కిర్రాక్ లేడీ ఎంటరైంది. ఆమె గురించి పూర్తి వివరాలను మీరే చూడండి!

జోష్‌తో మొదలైన 8వ సీజన్
బిగ్ బాస్ షోపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వాటిని ఏమాత్రం తగ్గించకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్న నిర్వహకులు ఇప్పుడు ఎనిమిదో దాన్ని కూడా ప్రారంభించారు. ఈరోజే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రీమియర్ ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. ఇందులో కంటెస్టెంట్ల ఆటపాటలు, సెలెబ్రిటీల ఎంట్రీలతో ఫుల్ జోష్‌తో సాగిపోతోంది.

Baby Movie Fame Kirrak Seetha Entered into Bigg Boss Telugu 8 Show

టిస్టులు.. సర్‌ప్రైజ్‌లతోనూ
బిగ్ బాస్ గత సీజన్ హిట్ అవడంతో ఎనిమిదో దాన్ని మరింత సూపర్ సక్సెస్ చేయాలని నిర్వహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే దీన్ని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, టాస్కులు ఇస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే సరికొత్త కాన్సెప్టు కనిపిస్తోంది. ఫలితంగా ఇది ఆరంభంలోనే మరింత హైలైట్ అవుతోంది.

షోలోకి వచ్చిన కిర్రాక్ సీత
ఎంతో గ్రాండ్‌గా జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‌లోకి కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే కొంత మంది పోటీదారులుగా హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్‌గా ప్రముఖ నటి కిర్రాక్ సీత ఎంటర్ అయింది. ముందుగా ఆమెకు సంబంధించిన ప్రోమోను చూపించారు. అందులో ఆమె ఎంతో ఎమోషనల్ అవుతూ కనిపించింది.

ఇంతకీ ఎవరీ కిర్రాక్ సీత?
తెలుగు అమ్మాయి అయిన కిర్రాక్ సీత ఆరంభం నుంచీ బోల్డుగా ఉంటోంది. ముఖ్యంగా సరయు రాయ్‌తో కలిసి యూట్యూబ్‌లో బూతులు మాట్లాడుతూ వీడియోలు చేసింది. అలా ఈ అమ్మడు చాలా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 'బేబీ' సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టే పాత్రను చేసి మరింత హైలైట్ అయింది. అలా ఎన్నో ఆఫర్లు అందుకుని ఇప్పుడు బిగ్ బాస్‌లోకి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X