బిగ్ బాస్‌లోకి ‘బూతు’ పిల్ల.. బేబీ సినిమా తర్వాత బంపర్ ఆఫర్
తెలుగు బుల్లితెరపై దర్శక నిర్మాతలు, షో నిర్వహకులు అప్పటి వరకూ పెట్టుకున్న సరిహద్దులను చెరిపేస్తూ సెన్సేషన్ అయిందే బిగ్ బాస్. కొందరిని ఒక ఇంట్లో ఉంచి, వాళ్లతో ఆటలు ఆడించి, ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించే కాన్సెప్టుతో ఇది వచ్చింది. దీంతో దీనికి భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభించింది. దీంతో ఇది రికార్డు స్థాయిలో రేటింగ్ రాబట్టి దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇందులోకి ఓ క్రేజీ లేడీ రాబోతుందట. ఆ వివరాలను మీరే చూసేయండి!
అన్ని సీజన్లూ సూపర్‌గా
ఇండియాలోని చాలా భాషలతో పోల్చుకుంటే తెలుగులోకి బిగ్ బాస్ షో కాస్త ఆలస్యంగానే వచ్చింది. అయినా ఆరంభంలోనే ఇది సంచలనం అయింది. అప్పటి నుంచి నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను నిర్వహకులు పూర్తి చేసుకున్నారు. వీటికి దేశంలోనే భారీ రేటింగ్ లభించి సత్తా చాటాయి.

ఎనిమిదోది వినోదంతోనే
తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌ను 'అంతులేని వినోదం' (ఇన్ఫినిటీ ఎంటర్‌టైన్‌మెంట్) అనే కాన్సెప్టుతో తీసుకు వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం లీకైంది.
ఆరోజు నుంచే.. అలాగే
గత సీజన్ సెన్సేషనల్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అఫీషియల్ లోగోను విడుదల చేశారు. తర్వాత కొన్ని ప్రోమోలను కూడా వదిలారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతునట్లు కూడా వెల్లడించారు. దీంతో ఈ సీజన్‌పై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.
వాళ్లంతా కంటెస్టెంట్లు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక చాలా రోజుల క్రితమే మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే చాలా మందిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లోకి ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, రీతూ చౌదరి, యాంకర్ వింద్యా, గాయత్రి గుప్తా, పవిత్ర, పొట్టి నరేష్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్‌లో కిర్రాక్ సీత
భారీ అంచనాల నడుమ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా లీక్ అవుతన్నాయి. ఇలా ఇప్పుడు ఓ క్రేజీ లేడీ పేరు బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రానికి చెందిన కాంట్రవర్శీ హీరోయిన్ 'కిర్రాక్ సీత' కూడా ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వస్తుందని తెలిసింది.
బూతులు, బేబీ మూవీ
తెలుగు అమ్మాయి అయిన కిర్రాక్ సీత ఆరంభం నుంచీ బోల్డుగా ఉంటోంది. ముఖ్యంగా సరయు రాయ్‌తో కలిసి యూట్యూబ్‌లో 'బూతులు మాట్లాడే వీడియోలు' చేసింది. అలా ఈ అమ్మడు చాలా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే 'బేబీ' సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టే పాత్రను చేసి మరింత హైలైట్ అయింది. అలా ఎన్నో ఆఫర్లు అందుకుని ఇప్పుడు బిగ్ బాస్‌లోకి రాబోతుంది.


Click it and Unblock the Notifications











