Bigg Boss Elimination: తెలుగు బిగ్ బాస్ చెత్త రికార్డు.. పాపం ఆ ఆరుగురు బలి.. ఇండియాలోనే తొలిసారిగా!
ఊహకే అందని మలుపులతో సాగుతూ ప్రేక్షకులకు అదిరిపోయేలా మజాను అందిస్తోన్న ఏకైక షోనే బిగ్ బాస్. మరీ ముఖ్యంగా ఇందులో ఎన్నడూ చూడని టాస్కులు, గొడవలు, లవ్ ట్రాకులు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు కనిపించడంతో దీనికి ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. దీంతో షో నిర్వహకులు వరుసగా సీజన్లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఎనిమిదో దాన్ని మొదలెట్టారు. ఇందులో ఫస్ట్ ఎలిమినేషన్ కూడా ఈ ఆదివారమే జరిగిపోయింది. దీంతో తెలుగు బిగ్ బాస్ షోలో చెత్త రికార్డు నమోదైంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!
రికార్డు రేటింగ్‌తో సక్సెస్‌ఫుల్
ఎన్నో అనుమానాల మధ్యన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులోకి వచ్చింది. అసలు ఇలాంటి వాటిని మన వాళ్లు ఆదరిస్తారా అని అంతా అనుకున్న పరిస్థితుల్లో ఈ షోకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా ఎన్నో అంచనాల నడుమ మొదలైంది.

అంతులేదు.. బేబక్క అవుట్
గత సీజన్‌ను మించిన రేటింగ్‌ను రాబట్టాలన్న లక్ష్యంతో అన్‌లిమిటెడ్ అనే కాన్సెప్టుతో సెప్టెంబర్ 1వ తేదీన ఎనిమిదో సీజన్‌ను ఇటీవలే ప్రారంభించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని సర్‌ప్రైజ్‌లు, టాస్కులు, ట్విస్టులతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇక, ఈ సీజన్ మొదటి వారం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది.
ఎలిమినేషన్‌తో కొత్త చర్చ
తెలుగు బిగ్ బాస్ చరిత్రలో (ఓటీటీ వెర్షన్ మినహా) ఇప్పటి వరకూ లేడీ కంటెస్టెంట్లు విన్నర్ అవలేదు. అంతేకాదు, నిన్నటి ఎపిసోడ్ వరకూ మొత్తం ఎనిమిది సీజన్లలో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే.. ఆరుగురు లేడీ కంటెస్టెంట్లే మొదటి వారం ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆడవాళ్లకు బిగ్ బాస్ షోలో అన్యాయం జరుగుతుందని చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
ఆ ఆరుగురిని బలి చేశారు
బిగ్ బాస్ మొదటి సీజన్‌లో జ్యోతి, రెండో సీజన్‌లో సంజన, మూడో సీజన్‌లో హేమ, ఐదో సీజన్‌లో సరయు రాయ్, ఏడో సీజన్‌లో కిరణ్ రాథోడ్, ఎనిమిదో సీజన్‌లో బెజవాడ బేబక్క ఇంటి నుంచి బయటకెళ్లారు. ఇక, 4వ సీజన్‌లో సూర్య కిరణ్ మాత్రమే మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అలాగే, ఆరో సీజన్‌లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు. అంటే ఎక్కువగా లేడీస్ వెళ్లిపోయారు.
ఇండియాలో చెత్త రికార్డుగా
ఇండియాలో ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ తెలుగులో మాత్రమే ఫస్ట్ వీక్‌లో ఎక్కువ మంది లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతో పాటు చెత్త రికార్డును కూడా నమోదు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేయాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











