Bigg Boss Finale నా భర్త అంటూ షాకింగ్ గా ఆరోహి.. పవర్ ఫుల్ గా బాలాదిత్య కూతురు పేరు!

ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఇలా దేశంలోనే మరే షోకూ దక్కని రేటింగ్‌ను రాబడుతూ సత్తా చాటుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకంటూ ముందుగు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఆరో సీజన్ ను కూడా నిర్వహించారు. 104 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 6 ఎట్టకేలకు ఫినాలేకు చేరుకుంది. ఆదివారం నిర్వహిస్తున్న గ్రాండ్ ఫినాలేలో మాజీ కంటెస్టెంట్స్ సందడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

టైటిల్ రేసులో ఐదుగురు..

టైటిల్ రేసులో ఐదుగురు..

ఎంతో బజ్‌తో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ పోటీలో నిలిచారు.

 భారీ ఖర్చుతోపాటు సర్ ప్రైజ్ లు..

భారీ ఖర్చుతోపాటు సర్ ప్రైజ్ లు..

వంద రోజులకు పైగా ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ ఆరో సీజన్ డిసెంబర్ 18 ఇవాళ పూర్తి కాబోతుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ గ్రాండ్ ఫినాలే స్పెషల్ ఎపిసోడ్ వైభవంగా జరుగుతోంది. ఇందుకోసం నిర్వహకులు భారీ ఖర్చు చేయడంతో పాటు ఎన్నో సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

క్లోజ్ ఫ్రెండ్స్ డ్యాన్స్..

క్లోజ్ ఫ్రెండ్స్ డ్యాన్స్..


అదిరిపోయే స్టైలిష్ లుక్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. తర్వాత మాజీ కంటెస్టెంట్స్ కు స్వాగతం పలికాడు నాగార్జున. దీంతో అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్,
సుదీప (పింకీ)-మెరీనా అబ్రహం జంటలుగా విడివిడగా సాంగ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. అలాగే హౌజ్ లో క్లోజ్ ఫ్రెండ్స్ గా పేరు తెచ్చుకున్న ఆర్జే కల్యాణ్-ఫైమా-రాజ శేఖర్ కలిసి డ్యాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చారు.

పవర్ ఉన్న వ్యక్తి..

పవర్ ఉన్న వ్యక్తి..

వీళ్ల తర్వాత అభినయశ్రీ సోలో పర్ఫామెన్స్ తో భూమ్ బద్దలు సాంగ్ తో అదరగొట్టింది. తర్వాత ఎక్స్ హౌజ్ మేట్స్ ఒక్కొక్కరిని పలకరించి మాట్లాడాడు నాగార్జున. ముందుగా బాలాదిత్యతో మాట్లాడిన నాగార్జున ఆయన కూతురు ఎలా ఉందని అడిగారు. అప్పుడే యజ్ఞ విధాత్రి ఎలా ఉందని నాగార్జున అడగడంతో.. బాలాదిత్య చాలా ఆనందంతో బాగుంది అని చెప్పాడు. తర్వాత ఆ పేరుకు అర్థం ఏంటని నాగార్జున అడిగితే.. విధాత్రి అంటే పవర్ ఉన్న వ్యక్తి అని, యజ్ఞ అంటే సరస్వతి అని బాలాదిత్య సమాధానం ఇచ్చాడు.

నేను కూడా ఫ్యానే..

నేను కూడా ఫ్యానే..


ఎక్స్ హౌజ్ మేట్స్ ను పలకరించే క్రమంలో ఆరోహి రావు గురించి అడిగారు నాగార్జున. బిగ్ బాస్ తర్వాత ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు.. చాలా బాగుందని, తన స్లాంగ్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారని చెప్పింది. అందుకు నాగార్జున కూడా నేను కూడా ఫ్యానే అని చెప్పారు. దీంతో ఇది చాలా పెద్ద మాట సార్.. థ్యాంక్యూ సో మచ్ అని సంతోషం వ్యక్తం చేసింది.

ఏ వైపు చూసుకున్నా..

ఏ వైపు చూసుకున్నా..


తర్వాత హౌజ్ మేట్స్ తో రిలేషన్ ఎలా ఉందని నాగార్జున అడగ్గా.. చాలా బాగుంది.. హౌజ్ లో కంటే బయటే ఇంకా చాలా బాగుంది రిలేషన్ అని ఆరోహి రావు చెప్పింది. వాసంతి అయితే నా హస్బండ్ సార్ అని ఆరోహి అంటే.. షాక్ అయిన నాగార్జున.. ఏ వైపు చూసుకున్న వాసంతి అబ్బాయిలా ఉండదే అని నాగార్జున అన్నాడు. దీనికి నేను ఉంటా కదా సార్.. అటు అబ్బాయిగా ఇటు అమ్మాయిగా అని ఆరోహి రావు షాకింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X