జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అదే.. అప్పుడు అలా ఉండేది: బలగం డైరెక్టర్ వేణు
జబర్దస్త్ కంటే ముందే కమెడియన్ వేణు సినిమాల్లో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. మొదట్లో సహాయక దర్శకుడిగా కూడా అతని ప్రయాణం కొనసాగింది. ఇక తర్వాత తేజ సినిమాలో అవకాశం దక్కించుకొని అనంతరం కొన్ని సినిమాలకు రైటర్ గా కూడా వర్క్ చేశాడు. ఇక ఇటీవల బలగం సినిమాతో మొదటిసారి దర్శకుడిగా పరిచయమైన వేణు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లడానికి గల కారణాన్ని వేణు చాలా కాలం తర్వాత తెలియజేసాడు. ఆ వివరాలలోకి వెళితే..

మొదట సహాయక దర్శకుడిగా..
కమెడియన్ వేణు ముందుగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే అతను మొదట్లో అనుకోకుండా కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడుగా కూడా వర్క్ చేయడం జరిగింది. తేజ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే తేజ సినిమాల ద్వారానే అతనికి కమెడియన్ గా అప్పట్లో మంచి అవకాశాలు వచ్చాయి.

ఆ సినిమాలతో మంచి బ్రేక్
ధైర్యం, అవునన్నా కాదన్నా అలాగే మరికొన్ని తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో వేణు మంచి కామెడీ పాత్రలు చేశాడు. ఇక అతనికి మంచి బ్రేక్ వచ్చింది మాత్రం జగడం మున్నా సినిమాల ద్వారానే. ముఖ్యంగా ప్రభాస్ మున్నా సినిమాలో అతను చేసిన పాత్ర బాగా క్లిక్ అయింది. ఇక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా చాలా కాలం పాటు వేణు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగాడు.

దాదాపు 3 ఏళ్ళ వరకు
అయితే సినిమా ఇండస్ట్రీలో 2010 తర్వాత మాత్రం వేణుకి కాస్త అవకాశాలు తగ్గాయి. ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో అతను చేసిన ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభించింది. ఇక అక్కడే దాదాపు 3 ఏళ్ల వరకు వేణు ప్రయాణం కొనసాగింది. మంచి కంటెంట్ ఉన్న కామెడీతో అతను ఎంతగానో గుర్తింపు అందుకున్నాడు. అతని ద్వారానే గెటప్ శ్రీను సుడిగాలి సుదీర్ కూడా మంచి క్రేజ్ అందుకున్నారు.

హఠాత్తుగా బయటకు వెళ్లిపోవడంతో
ఇక జబర్దస్త్ నుంచి మాత్రం వేణు హఠాత్తుగా బయటకు వెళ్లిపోవడంతో వివాదాలు కారణంగానే అతను బయటికి వెళ్లిపోయినట్లుగా అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక ఆ విషయంలో మధ్యలో కూడా వేణు పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వేణు జబర్దస్త్ మానేసిన తర్వాత కూడా ఇండస్ట్రీలో మళ్లీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. కొంతకాలం అతను ఖాళీగానే ఉండాల్సి వచ్చింది.

దిల్ రాజు నుంచి మరో అవకాశం
ఇక మొత్తానికి ఇటీవల వేణు దర్శకుడిగా తన సరికొత్త జీవితాన్ని ప్రారంభించాడు. బలగం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన బలగం సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. దీంతో సినిమా సక్సెస్ కావడంతో దిల్ రాజు వేణుకి మరొక అవకాశం కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ బిగ్ బడ్జెట్ కథతోనే వేణు రాబోతున్నాడు.

జబర్దస్త్ నుంచి రావడానికి కారణం
అయితే జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోవడానికి గల కారణాన్ని వేణు ఇటీవల తెలియజేశాడు. మొత్తానికి అయితే వివాదాల కారణంగా వెళ్ళిపోలేదని క్లారిటీ అయితే ఇచ్చాడు. మొదటి నుంచి కూడా సినిమాల్లో ఉండాలి అనేది తన కోరిక అని ఇక సినిమాలో రెగ్యులర్ గా కొనసాగాలని ఆలోచనతోనే బయటకు వచ్చేసినట్లు చెప్పాడు. ఇక నేను బయటకు వచ్చినప్పుడు జబర్దస్త్ రేటింగ్ దాదాపు 18 ఉండేది. మంచి ఆదాయం గుర్తింపు కూడా వచ్చేది కాబట్టి అప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సినిమాలు కోసం వచ్చేయాల్సి వచ్చింది.. అని వేణు వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











