Balagam: బుల్లితెరపై బలగం రికార్డు.. స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువ రేటింగ్

గతంలో కంటే ఇప్పుడు తెలుగులో నేచురల్ స్టోరీలతో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలి కాలంలో దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తూ.. స్వచ్చమైన కథలతో సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇటీవల అలా వచ్చిన సినిమానే 'బలగం'. తెలంగాణ ప్రాంతంలోని సంప్రదాయాలకు అద్దం పట్టే సహజ సిద్ధమైన కథతో తెరకెక్కిన ఈ మూవీని ఫేమస్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి.. మంచి బజ్‌ను ఏర్పరచుకుంది.

దిల్ రాజు బ్యానర్‌లో రూపొందిన 'బలగం' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని ఏరియాల్లోనూ ఊహించని రీతిలో భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.55 కోట్లు షేర్‌తో పాటు రూ. 27.30 కోట్లు గ్రాస్‌ వసూళ్లు వచ్చాయి. దీంతో రూ. 11 కోట్లకు పైగా లాభాలూ దక్కాయి. ఇక, ఈ చిత్రం ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

Balagam Movie Gets Huge TRP Rating In First Time Telecast

థియేటర్లు, ఓటీటీలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'బలగం' మూవీ.. ఇటీవలే స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ఏకంగా 14.30 టీఆర్పీ రేటింగ్ లభించింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా ఇంత ఎక్కువగా రేటింగ్‌ను రాబట్టలేకపోయాయి. దీనికితోడు ఓటీటీల హవా నడుస్తోన్న ఈరోజుల్లో కూడా ఒక చిన్న చిత్రం ఈ రేంజ్‌లో రేటింగ్‌ను సాధించడం గొప్ప విషయం అనే చెప్పాలి.

Balagam Movie Gets Huge TRP Rating In First Time Telecast

ఇదిలా ఉండగా.. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఎమోషనల్ మూవీనే 'బలగం'. ఇందులో ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు చేశారు. భీమ్స్ దీనికి సంగీతం ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X