twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ' చిన్నారి పెళ్లి కూతురు' సీరియల్ కు అరుదైన రికార్డ్

    By Srikanya
    |

    ముంబై ‌: భారత టెలివిజన్‌ సీరియల్‌ బాలికావధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)అరుదైన గుర్తింపు సాధించింది. 2వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తొలి డ్రామా సిరీస్‌గా రికార్డు సృష్టించింది. తమ ఛానల్‌లో ప్రసారమయ్యే సీరియల్‌ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు కలర్స్‌ సీఈవో రాజ్‌ నాయక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

    టెలిఛానల్‌ కలర్స్‌లో 2008న ఈ సీరియల్‌ ప్రారంభమైంది. బాల్యవివాహాలు, గృహహింస, మహిళా సాధికారత లాంటి సామాజిక అంశాలను ప్రతిబింబించే ఈ సీరియల్‌ గత ఆరేళ్లుగా లక్షల మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు' పేరుతో ఈ సీరియల్‌ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

    Balika Vadhu is Indian TV's First Drama to Hit 2000 Episodes

    ఉత్తర భారతంలోని చాలా కుటుంబాల్లో ఒకరిగి కలిసిపోయిన బాలికావధు, ఇప్పుడు తెలుగు లోగిల్లలోనూ చిన్నారి చిట్టి సభ్యురాలు అయ్యింది. చిన్నారి పెళ్లికూతురుగా తెలుగు లో డబ్ అయిన బాలికావదు అత్యంత ఆధరణతో టాప్ ప్లేస్ లో ఉంది. ఎదిగీ ఎదగనీ వయస్సులో వివాహం జరిగితే, ఆ పిల్లల జీవితమే పాడవుతుందని, బాల్యవివాహాలను ప్రొత్సాహించొద్దని మంచి ఉద్దేశంతో వచ్చిన చిన్నారి పెళ్లికూతురు సందేశాత్మక సీరియల్ గా సక్సెస్ గా దూసుకెళ్తోంది.

    English summary
    Popular TV show Balika Vadhu, starring Toral Rasputra in the lead, has become the first drama series to cross the 2000-episode landmark. The Colors' show, which features various social issues including child marriage, domestic abuse and marital rape, battles for women's empowerment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X