Sixth Sense 4 ‘పవన్’ డైలాగ్స్‌తో అదరగొట్టిన బండ్ల గణేష్.. డాలర్ శేషాద్రి అంటూ ఓంకార్‌ను ఆటపట్టిస్తూ

యాంకర్, డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న సిక్త్‌సెన్స్ తాజా సీజన్ మంచి జోష్‌తో కొనసాగుతున్నది. టాప్ యాంకర్లు, యాక్టర్లను మేలవించి ఈ రియాలిటీ షోపై మంచి ఆసక్తిని పెంచాడు. ఓంకార్ తనదైన శైలిలో షోను జనరంజకంగా మార్చారు. ప్రతీ ఎపిసోడ్‌కు, సీజన్‌కు గేమ్ ఫార్మాట్‌ను మారుస్తూ ఈ షోపై అంచనాలు పెంచుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ చేసిన అల్లరి ఏమిటంటే...

వన్ సెకన్ అంటూ వార్నింగ్

వన్ సెకన్ అంటూ వార్నింగ్

ఓంకార్ హోస్ట్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న సిక్త్స్‌సెన్స్ షోలో ఆయన హావభావాలు, స్టైల్ ట్రెండింగ్‌గా మారాయి. వన్ సెకన్ అంటూ కంటెస్టెంట్లను, సెలబ్రిటీల గుండెల్లో దడపుట్టించే ఆయన ట్రేడ్ మార్క్ వార్నింగ్ ఇప్పుడు అందరిని ఫాలో అయ్యేలా చేస్తున్నది.

బండ్ల గణేష్ కూతురు ప్రత్యేక ఆకర్షణ

బండ్ల గణేష్ కూతురు ప్రత్యేక ఆకర్షణ

సిక్త్‌సెన్స్‌లో ఈ వారాంతంలో ప్రసారమయ్యే తాజా ఎపిసోడ్‌లో బండ్ల గణేష్, ఆయన కూతురు, నందితా శ్వేత, అన్ని మాస్టర్, జియా తదితరులు గెస్టులుగా వచ్చారు. ఎప్పటిలానే తన ట్రేడ్ మార్క్ హావభావాలను ప్రదర్శించి ఓంకార్ ఆకట్టుకొన్నారు. ఈ షోలో బండ్ల గణేష్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. పవన్ కల్యాణ్ వీడియో రాగానే తనదైన శైలిలో స్పందించారు.

డాలర్ శేషాద్రికి.. నాకు తెలియదా?

డాలర్ శేషాద్రికి.. నాకు తెలియదా?

సిక్త్‌సెన్స్ షోలో భాగంగా స్క్రీన్‌పై ప్రదర్శించిన ఓ ప్రోమో వీడియోను చూసిన నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా ఎక్సైటింగ్ అయ్యారు. పవన్ కల్యాణ్ బెల్ట్‌ను నువ్వే కొనిపెట్టావా? అంటూ ఓంకార్ ప్రశ్నిస్తే.. వెంకటేశ్వర స్వామి ఎలాంటి ఉత్సవాలు చేస్తారో డాలర్ శేషాద్రికి తెలియదా? అలాగే పవర్ స్టార్‌ గురించి నాకు తెలియదా అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు.

పరమేశ్వరా.. పవరేశ్వరా అంటూ

పరమేశ్వరా.. పవరేశ్వరా అంటూ

పవన్ కల్యాణ్ గురించి మరోసారి బండ్ల గణేష్ మాట్లాడుతూ.. నా దేవర, నా దేవుడు, నా సర్వస్వం, నా ఆస్తి.. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా అంటూ డైలాగ్స్‌తో అదరగొట్టేశారు. ఆ తర్వాత తన కూతురు గురించి చెబుతూ... నా జీవితంలో నా కూతురు రెండే రెండు ప్రశ్నలు వేసింది. పవన్ కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తారు? ఓంకార్ అన్నయ్య నిర్వహించే సిక్త్‌సెన్స్ షోకు ఎప్పుడు తీసుకెళ్తావు అని అడిగింది. అది నీకు ఉన్న క్రెడిబిలిటి అంటూ బండ్ల గణేష్ డైలాగుల వర్షం కురిపించారు.

Recommended Video

Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
గ్లామర్ పంట పండించిన నందితా, అన్నీ మాస్టర్

గ్లామర్ పంట పండించిన నందితా, అన్నీ మాస్టర్

సిక్త్‌సెన్స్ షోలో ఓ చిన్నారిని నా షోను చూస్తావా? అందుకు ప్రూఫ్ చూపిస్తావా? అంటూ ఓంకార్ అడిగితే.. అతడి స్టైల్‌లో వన్ సెకన్ అంటూ అరిచి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ గేమ్‌లో నందితా శ్వేత, అన్ని మాస్టర్ గ్లామర్ పంటను పండించినట్టు తాజా ప్రోమోలో కనిపించింది. ఈ షోను తప్పకుండా చూడాలనే విధంగా ప్రోమో ఆసక్తిని రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X