Bangarraju 16 Days Collections: మళ్లీ పుంజుకున్న బంగార్రాజు.. అయినా అన్ని కోట్లు వస్తేనే హిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయన్న విషయం తెలిసిందే. సినీ ప్రియులంతా ఇలాంటి చిత్రాలను చూడడానికి ఇష్టపడుతోన్న నేపథ్యంతో దర్శక నిర్మాతలు మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి చెందిన తండ్రీ కొడుకులు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమే 'బంగార్రాజు'. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఆరంభంలో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో బంగార్రాజు 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరూ చూడండి!
Recommended Video

సంక్రాంతి బరిలో దిగిన బంగార్రాజు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన చిత్రమే 'బంగార్రాజు'. ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది.

బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్
అక్కినేని హీరోల కాంబోలో వచ్చిన 'బంగార్రాజు' హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.16 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.16 కోట్లు బిజినెస్ జరిగింది.

16వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు
'బంగార్రాజు' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 16వ రోజు కలెక్షన్లు కొంత పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో రెండు రాష్ట్రాల్లో 16వ రోజు రూ. 22 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్ వచ్చింది.

16 రోజులకు కలిపి వచ్చింది ఎంత
16 రోజులకు కలిపి 'బంగార్రాజు'కు ఏపీ తెలంగాణలో కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 8.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.08 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.05 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.84 కోట్లు, గుంటూరులో రూ. 3.38 కోట్లు, కృష్ణాలో రూ. 2.20 కోట్లు, నెల్లూరులో రూ. 1.72 కోట్లతో.. రూ. 34.14 కోట్లు షేర్, రూ. 55.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో కలిపి 16 రోజులకు రూ. 34.14 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు.. మిగిలిన ప్రాంతాల్లో పర్వాలేదనిపించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.47 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా 16 రోజుల్లో రూ. 37.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 62.75 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 16 రోజుల్లో రూ. 37.36 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.64 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











