twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జోగిని ప్రశాంతి'గా మారిన టిక్ టాకర్ బంజారాహిల్స్ ప్రశాంత్.. మూడు ముళ్ళు వేసి మరీ!

    |

    టిక్ టాక్ అనే యాప్ భారతదేశంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ యాప్ పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలు అయిన పరిస్థితి. తెలుగులో అయితే ఈ యాప్ కారణంగా దుర్గారావు, ఉప్పల్ బాలు, అగ్గి పెట్టి మచ్చ లాంటి వాళ్ళు సినిమా అవకాశాలు కూడా దక్కించుకున్నారు. ఏకంగా ఈ టిక్ టక బ్యాచ్ అంతటినీ కలిపి బడా బాస్ అని బిగ్ బాస్ లాంటి ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. అందులో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న బంజారాహిల్స్ ప్రశాంత్ ఇప్పుడు జోగినిగా మారాడు ఆ వివరాల్లోకి వెళితే..

    బంజారాహిల్స్ ప్రశాంత్

    బంజారాహిల్స్ ప్రశాంత్

    ఒకప్పుడు టిక్ టాక్ చూసిన వాళ్ళకు, ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్స్ ఫాలో అవుతున్న వారికి అలాగే సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యే వారికి బంజారాహిల్స్ ప్రశాంత్ అనే పేరు పరిచయం అక్కర్లేదు. చూడటానికి బక్క పలచగా ఉండే ఈ వ్యక్తి మొదట్లో పద్ధతిగా అబ్బాయి లాగా కనిపించే వాడు కానీ రాను రాను అసలు అమ్మాయి లాగా బట్టలు ధరించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు.

    బడా బాస్ అనే ఒక ప్రోగ్రాం లో కూడా

    బడా బాస్ అనే ఒక ప్రోగ్రాం లో కూడా

    ఉప్పల్ బాలు, కాగజ్ నగర్ సాయి, ఇలాంటి వాళ్ళతో కలిసి కనిపిస్తూ సోషల్ మీడియాలో ఉండే మీమ్ పేజిల పుణ్యమా అని చాలా ఫేమస్ అయ్యాడు. అయితే మొన్నీ మధ్య రాకేష్ మాస్టర్ హోస్ట్గా యూట్యూబ్ లో ప్రసారమైన బడా బాస్ అనే ఒక ప్రోగ్రాం లో కూడా ప్రశాంత్ కనిపించాడు. అయితే ప్రశాంత్ అప్పటికే లింగ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అలా ప్రశాంత్ కాస్తా ప్రశాంతి గా మారాడు.

    కత్తితో వివాహమాడి జోగిని గా

    కత్తితో వివాహమాడి జోగిని గా

    హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నాడు కత్తితో వివాహమాడి జోగిని గా మారారు. ఆమె మెడలో జోగిని గురువు మూడుముళ్లు వేశారు. మామిడి, నేరేడు, వేప ఆకులతో వేసిన మండపంలో సంప్రదాయబద్దంగా జరిగిన ఈ జోగు వివాహానికి ప్రశాంతి కుటుంబీకులు, బంధువులు, ప్రశాంతి స్నేహితులు తదితరులు హాజరయ్యారు.

    మెడలో మూడుముళ్లు

    మెడలో మూడుముళ్లు

    ఇక ఈ జోగు వివాహ కార్యక్రమంలో.. తొలుత పండితుడి సూచనల మేరకు ప్రశాంతి తల్లిదండ్రులు అనంతలక్ష్మి, నర్సింహులు 'ఎల్లమ్మ మునిరాజు జోగు కల్యాణం'గా పిలిచే వివాహ క్రతువు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అనంతరం జోగిని గురువు భూపేష్ నగర్ జగన్ యాదవ్(మేఘన), ప్రశాంతి మెడలో మూడుముళ్లు వేశారు. ఇక దానికంటే ముందే ఉంగరాలు మార్చుకోవడం, తలపై జీలకర్ర-బెల్లం ఉండటం లాంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు.

     అదృష్టంగా

    అదృష్టంగా

    ప్రశాంతిని జోగు కళ్యాణం చేసుకున్న అనంతరం గురువు (మేఘన) ఆ పెళ్లికి హాజరైన మరికొంత మంది ట్రాన్స్ జెండర్ల మెడలో సైతం మూడుముళ్లు వేశారు. అమ్మ వారి సేవలో జీవితాన్ని అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జోగినిగా మారిన ప్రశాంతి మీడియా ముందు పేర్కొంది. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లు ప్రశాంతి వివాహానికి హాజరయ్యారు.

    Recommended Video

    Actor Harshavardhan Funny Interview With Raja Vikramarka Crew
    అలా మొదలై

    అలా మొదలై

    మతం ముసుగులో మహిళలను లైంగిక వాంఛ తీర్చుకోవడానికి భూస్వాములు జోగిని అనే వ్యవస్థకు శ్రీకారం చుట్టారని చెబుతూ ఉంటారు. వివాహం కాని ఆడపిల్లలను గ్రామానికి దత్తత ఇవ్వడాన్ని జోగిని అంటారు. ఒకప్పడు ఒకే కుటుంబానికి చెందిన వారిని జోగినీలుగా మార్చేవారు. ఆధునిక టెక్నాలజీవైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఇలా లింగమార్పిడి చేసుకున్న వారు ఎక్కువగా జోగినిగా మారుతున్నారు.

    English summary
    Banjarahills Prashanth Became Jogini Prashanthi after required rituals
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X