యాంకర్ ప్రదీప్‌కు సరైనోడు.. ఆ మాటతో పరువుతీసిన బాబా భాస్కర్.. చేతులెత్తేసిన నాగబాబు!!
కొరియోగ్రాఫర్‌గా మాత్రమే తెలిసిన బాబా భాస్కర్‌లోని రెండో కోణాన్ని చూపెట్టింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ మూడో సీజన్‌లో బాబా భాస్కర్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇంకెవ్వరూ ఇచ్చి ఉండరు. ఇకపై ఎవ్వరూ ఇవ్వలేరు కూడా. అయితే బాబా భాస్కర్‌పై కొన్ని సార్లు నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అతి మంచితనం, కన్నింగ్ అంటూ ట్రోల్స్ నడిచాయి. కానీ బాబా మాస్టర్ మాత్రం ఎప్పుడూ ఎంటరైన్ చేస్తూనే వచ్చాడు.

బిగ్‌బాస్‌లో సందడి..
బిగ్‌బాస్‌లో బాబా మాస్టర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అందరిపైనా కామెంట్లు, సెటైర్లు వేస్తూ అంతా హల్చల్ చేశాడు. బాబా వేసే స్టెప్పులే కాదు సెటైర్లు, పంచ్‌లు కూడా దుమ్ములేపేవి. ఏకంగా నాగార్జున పేరునే మార్చేశాడు. నాగరాజు అని పిలిచేవాడు. ఆ విషయంపై బాబా మాస్టర్‌ను నాగార్జున ఓ రౌండ్ వేసుకున్నాడు. అప్పటి నుంచి సరిగ్గా పిలవడం ప్రారంభించాడు.

ఎమోషనల్ అయిన బాబా..
బిగ్ బాస్ హౌస్‌లో నిత్యం నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న బాబా మాస్టర్.. కొన్ని సార్లు కంటతడి కూడా పెట్టాడు. జాఫర్ ఎలిమినేట్ అయిన సందర్భంలో, అలీ రెజా నామినేట్ చేసిన సందర్భంలో కంటతడి పెట్టాడు. అలీ రెజా విషయంలోనే బాబా ఎక్కువగా హర్ట్ అయ్యాడు. కానీ బాబా మాస్టర్ మాత్రం అందర్నీ నవ్విస్తూనే ఉన్నాడు.

కనిపించని మాస్టర్..
బిగ్ బాస్ షో తరువాత మళ్లీ ఇంత వరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాలేదు బాబా భాస్కర్. బిగ్ బాస్ అనంతరం తనీష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూనే లాస్ట. అప్పటి నుంచి మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించనే లేదు. తాజాగా జీ తెలుగు చేస్తోన్న ఈవెంట్‌లో బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు. అందర్నీ ఓ ఆట ఆడుకున్నాడు.

ప్రదీప్ పెళ్లిపై పంచ్‌లు..
ఇక బాబా ఎంట్రీ ఇస్తే స్టేజ్ దద్దరిల్లాల్సిందేనని మరోసారి నిరూపించాడు. జానీ మాస్టర్‌తో కలిసి ఇస్మార్ట్ స్టెప్పులు వేస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ప్రదీప్, అతని పెళ్లిపై పడ్డాడు. ఇంకెన్నాళ్లు ఇలా ఉంటావ్ పెళ్లి చేసుకోవచ్చు కదరా అని బాబా మాస్టర్ సెటైర్ వేశాడు.

చేతులెత్తేసిన నాగబాబు..
బాబా మాస్టర్ వేసిన పంచ్‌కు ప్రదీప్ స్పందిస్తూ.. అలాంటివన్నీ పెద్దోళ్లు చూసుకుంటారు అని సమాధానమిచ్చాడు. మళ్లీ అందుకున్న బాబా.. నీ కంటే పెద్దవాళ్లు ఎవరు ఉంటారురా అని పంచ్ వేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇక జానీ మాస్టర్‌ను సైతం పంచ్‌లతో ఆడుకుంటుండగా.. బాబా ఎవర్నీ వదిలిపెట్టడు అంటూ నాగబాబు పగలబడి నవ్వాడు. బాబాతో పెట్టుకోలేమని చేతలెత్తేసినట్టు నాగబాబు చెప్పకనే చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











