మొదటిసారి భర్తతో ఆన్‌ స్క్రీన్ రొమాన్స్.. మరీ జబర్దస్త్‌గా అనసూయ

బుల్లితెరపై చానెల్స్ మధ్య కనబడని ఓ కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్‌లో దూకుడు ప్రదర్శిస్తుంటారు. ఈసారి అలాంటి పోటీనే నెలకొంది. ఈటీవీ, జీ తెలుగు వంటి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్స్‌ వినాయక చవితి పర్వదినాన అందర్నీ అలరించేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఈటీవీ వారు 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ రాబోతోండగా.. జీ తెలుగు వారు బాపు బొమ్మకు పెళ్లంట అంటూ విచ్చేస్తున్నారు.

 అక్కడ వారు ఇక్కడ వీరు..

అక్కడ వారు ఇక్కడ వీరు..

ఈటీవీ ప్రోగ్రాంలో జబర్దస్త్ గ్యాంగ్‌తో పాటు బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి, రాహుల్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక షో మొత్తం వీరి ప్రేమ కథ చుట్టే తిరగబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక జీ తెలుగులో అయితే నిహారిక పెళ్లి చుట్టూ తిరగబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

ప్రోమోలతోనే రచ్చ..

ప్రోమోలతోనే రచ్చ..

పునర్నవిని లేపుకొచ్చా, పెళ్లి చేసుకుంటా అని రాహుల్ అనడం, వారి పెళ్లికి జబర్దస్త్ గ్యాంగ్ తోడవ్వడంతో ఆ ప్రోమో పీక్స్‌కు వెళ్లింది. ఇలా 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి టీమ్ రచ్చ చేయగా.. మెగా ప్రిన్సెస్‌ను తీసుకొచ్చి బాపు బొమ్మకు పెళ్లంట అని అందరితో అనిపించారు. పెళ్లి కూతురు గెటప్‌లో పల్లకిలో రావడం, నాగబాబు ఎమోషన్ అందర్నీ కదిలించడం బాగానే వర్కౌట్ అయింది.

ఇది కొసమెరుపు..

ఇది కొసమెరుపు..

బాపు బొమ్మకు పెళ్లంటలో అనసూయ అందాలు కొసమెరుపు అని అర్థమవుతోంది. ఈ ఈవెంట్‌లో అనసూయ రచ్చ చేయబోతోందని తెలుస్తోంది. ఈమేరకు రిలీజ్ చేసిన ప్రోమో కూడా తెగ ఆకట్టుకుంది. ఇంతవరకు ఆమె తన భర్తను బుల్లితెరపై తీసుకుని రాలేదు.. బహిరంగంగా కూగా అంత రొమాన్స్ చేయలేదు. తాజాగా వీరిద్దరిపై రిలీజ్ చేసే ప్రోమో బాగా వైరల్ అవుతోంది.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
రొమాన్స్‌తో రచ్చ..

రొమాన్స్‌తో రచ్చ..

ఐ సినిమాలోని నువ్వుంటే నా జతగా.. అనే పాటకు అనసూయ, ఆమె భర్త సుశాంక భరద్వాజ్ దుమ్ములేపారు. స్టేజ్‌సై ఇద్దరూ రొమాన్స్‌ను బాగానే పండించారు. ఇక అనసూయ జంట ఈ ఈవెంట్‌కు బాగానే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక ప్రోమోలే ఇలా ఉంటే ఈవెంట్ ఇంకెలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X