Pallavi Prashanth Marriage: పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి.. అసలు విషయం చెప్పి షాకిచ్చిన శిరీష!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో పాల్గొన్న అతడు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రతీ ఒక్కరికీ ఆయన సుపరిచితుడు అయిపోయాడు. రైతుబిడ్డగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయిన బర్రెలక్క అలియాస్ శిరీష కూడా గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నెట్టింట మొత్తం వీరిద్దరి గురించి చర్చ సాగుతోంది. తాజాగా బర్రెలక్క ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది.
బిగ్ బాస్ షో తర్వాత ఇంటికి వచ్చినప్పటి నుంచి రైతుబిడ్డ ఎక్కువగా కనిపించట్లేదు. ఏవో చిన్న చిన్న పార్టీలు, పలు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్షన్లు వంటి వాటికి మాత్రమే హాజరు అవుతున్నాడు. టైటిల్ ఫినాలే రోజు జరిగిన గొడవ, అతడు అరెస్ట్ అవడం ఆ తర్వాత జరిగిన రచ్చతో ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ తాజాగా మరోసారి ఆయన వార్తల్లోకి వచ్చాడు. ఆయన బర్రెలక్కను పెళ్లి చేసుకోబోతున్నట్లు, ఇప్పటికే చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా మొత్తం వీరిద్దరూ సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారని.. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై బర్రెలక్క అలియాస్ శిరీష స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లుగా తనకు, పల్లవి ప్రశాంత్ కు పెళ్లి జరగలేదని.. అసలు జరిగే అవకాశం కూడా లేదని చెప్పింది. తనకు తెలియకుండా.. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్లను జైలుకు పంపించాలని... అసలు ఇలా తప్పుడు వార్తలు ఎలా రాయగల్గుతారు అంటూ ఫైర్ అయింది. బిగ్ బాస్ షో విన్నర్ గా మాత్రమే రైతుబిడ్డ తనకు తెలుసని శిరీష తెలిపింది.

బిగ్ బాస్ షోలో అతడు ఉన్నప్పుడు.. ఓ రైతు బిడ్డ వెళ్లాడని స్నేహితులు చెప్పగా... ఓ రెండు మూడు ఎపిసోడ్ లు మాత్రమే చూసినట్లు వెల్లడించింది. కానీ ఆ తర్వాత తాను ఎన్నికల్లో బిజీగా ఉండడంతో అసలు షో కూడా చూడలేదని.. ఫైనల్ ఎపిసోడ్ మట్టుకు చూశానని క్లారిటీ ఇచ్చింది. అయినా రైతుబిడ్డ అని తెలిసిన తర్వాత ఆయన గురించి నేను చాలా ఇంటర్వ్యూల్లో అన్నయ్య అని చెప్పానని.. అన్నాచెల్లెల్లు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించింది. వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారి తప్పుడు వార్తలు రాయొద్దని కోరింది.


Click it and Unblock the Notifications











