Bigg Boss 7 Telugu: రతికా టీమ్ మాస్టర్ ప్లాన్.. తిప్పికొట్టిన శివాజి.. ఈ టాస్క్ వేరే లెవెల్ అంతే!
గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టులతో తెలుగులో రకరకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో ఆరంభంలోనే ప్రత్యేకతను చాటుకుని సూపర్ డూపర్ హిట్ అయింది బిగ్ బాస్ షో. అందుకే నిర్వహకులు గ్యాప్ లేకుండా సీజన్ల మీద సీజన్లను ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇలా కొద్ది రోజుల క్రితమే ఏడో సీజన్‌ను మొదలెట్టారు. దీన్ని కొత్త కాన్సెప్టుతో నడుపుతూ వినోదాన్ని ఇస్తున్నారు.
గత సీజన్ల మాదిరిగా కాకుండా ఏడో దానిలో ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కంటెంట్, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో నడుపుతూ ఆసక్తిని పెంచుతూనే ఉన్నారు. ముఖ్యంగా టాస్కుల విషయంలో కొత్తదనం చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు హౌస్‌లోని కంటెస్టెంట్లకు 'మాయ అస్త్ర' అనే టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం బిగ్ బాస్ ఓ స్టోరీని చెప్పి సభ్యులకు వివరించాడు.

'మాయ అస్త్ర' టాస్కు కోసం ఇంటి సభ్యుల్లో అమర్‌దీప్, శివాజి, షకీలా, ప్రియాంక, ప్రిన్స్, శోభా శెట్టిలను రణధీర టీమ్‌గా.. గౌతమ్, ప్రశాంత్, రతికా, దామిని, శుభశ్రీ, తేజలను మహాబలి టీమ్‌గా విభజించారు. సందీప్ సంచాలకుడిగా ఉన్న ఈ టాస్కులో మొదటి రౌండ్‌లో 'టగ్ ఆఫ్ వార్' పెట్టగా.. రణధీర టీమ్ గెలిచి 'మాయ అస్త్ర'ను గెలుచుకునేందుకు ఓ కీ (తాళం) సాధించింది.
'మాయ అస్త్ర' టాస్కు పలు రౌండ్లలో జరగబోతుందని బిగ్ బాస్ ముందే చెప్పాడు. మొదటి రౌండ్‌లో గెలిచిన రణధీర గెలుచుకున్న కీ (తాళం)ని జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత కూడా ఆ టీమ్ సభ్యులకే ఉంటుంది. అయితే, తాజాగా వచ్చిన ప్రోమోలో ఆ కీని కొట్టేయడానికి మహాబలి టీమ్ సభ్యులు ప్లాన్ చేశారు. దీంతో ఈ టాస్కు మరింత ఆసక్తికరంగా మారబోతుంది.
తాజాగా వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో మహాబలి టీమ్ సభ్యుడు గౌతమ్ వాళ్ల దగ్గర ఉన్న కీని కొట్టేద్దాం అని తన జట్టు సభ్యులకు వెల్లడించాడు. దీంతో వాళ్లంతా దాన్ని ఎక్కడ దాస్తున్నారో కనిపెట్టే పనిలో పడ్డారు. ఆ తర్వాత ఆ కీని ఓ ప్యాంటులో పెట్టి చుట్టి దాచుకున్నారని ప్రశాంత్ తన టీమ్ సభ్యులకు చెప్పాడు. దీంతో దాన్ని దొంగిలించడానికి వాళ్లు నిద్ర పోకుండా కనిపించారు.
ఒకవైపు మహాబలి టీమ్ సభ్యులు తాళం కొట్టేయడానికి ప్లాన్ చేస్తుండగా.. దాన్ని రణధీర జట్టు శివాజి, అమర్‌దీప్ కనిపెట్టారు. దీంతో అది వాళ్లకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివర్లో శివాజి ఓ అడుగు ముందుకేసి తన ప్యాంటులోనే పెట్టుకుని పడుకుని వాళ్ల ప్లాన్‌ను తిప్పికొట్టాడు. మొత్తానికి బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగనుందని ఈ ప్రోమోను బట్టి అర్థం అయింది.


Click it and Unblock the Notifications











